Cinema : ప్రతి ఎపిసోడ్‌లో షాకింగ్ సస్పెన్స్.. ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ సిరీస్..
ప్రస్తుతం ఓటీటీలో ఓ క్రైమ్ సిరీస్ దూసుకుపోతుంది. ప్రతి ఎపిసోడ్‌లో షాకింగ్ సస్పెన్స్.. ఊహించని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఓటీటీలో ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు మీరు ఎన్నడూ చూడని కథ ఇది. ఈ మిస్టరీ మొదటి ఎపిసోడ్ నుంచి మొదలై చివరకు వరకు సాగుతూనే ఉంటుంది. ఇంతకీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిరీస్ గురించి మీకు తెలుసా..?

ఈమధ్య కాలంలో ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్, హారర్, లవ్ స్టోరీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో మేకర్స్ సైతం ఈ జానర్ సినిమాలు నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ వెబ్ సిరీస్ స్టోరీ మాత్రం ఇదివరకు మీరు ఎప్పుడూ వినని కథ. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ సిరీస్ పేరు సెల్ 145. ఇది హిందీలో కరాగర్ పేరుతో ఉంటుంది. 2022 లో వచ్చిన బంగ్లాదేశ్ సిరీస్ ఇది. ఇది ఆద్యంతం మిమ్మల్ని మరో ఆలోచనలోకి తీసుకెళ్తుంది. ఈ సిరీస్ కథ మొత్తం కేవలం ఒక జైలు చుట్టూనే తిరుగుతుంది.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
విషయానికి వస్తే.. ఒక జైలులో మొత్తం 325 మంది ఖైదీలు ఉన్నారు. వారిని ప్రతి సాయంత్రం లెక్కిస్తారు. అయితే ఒక సాయంత్రం లెక్కింపు పూర్తయినప్పుడు, అక్కడున్న అధికారి షాకవుతాడు. ఎందుకంటే అక్కడ 325 మంది ఖైదీలు ఉండాలి.. కానీ ఆరోజు 326 మంది ఖైదీలు ఉన్నట్లు లెక్కలోకి వస్తుంది. ఆ అదనపు ఖైదీ ఎక్కడి నుండి వచ్చాడు అనేది ప్రశ్న. ఎందుకంటే అతడు ఉండే సెల్ నంబర్ 145. కానీ ఈ సెల్ గత 50 సంవత్సరాలు మూసివేయబడి ఉంటుంది. దీంతో జైలు అధికారులు షాకవుతారు. కొత్త ఖైదీ మూసివేసిన సెల్ లోకి ఎలా వచ్చాడు.. అసలు ఎవరతను అి సందేహాలు వ్యక్తమవుతాయి. ఆ కొత్త ఖైదీ మాట్లాడలేడు.. కానీ సంజ్ఞా భాషలో మాత్రమే మాట్లాడతాడు. విచారణ సమయంలో, ఈ ఖైదీ చేసే విషయాలు విని జైలు యంత్రాంగం షాక్ అవుతుంది. తాను ఒక వ్యక్తిని చంపానని, అందుకే గత 250 సంవత్సరాలుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నానని చెబుతాడు. దీంతో ఈ కథ ఊహించని మలుపులు తిరుగుతుంది.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
‘సెల్ 145’ సిరీస్ క్లైమాక్స్ చాలా భావోద్వేగంగా, ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.ఈ సిరీస్‌లో రెండు సీజన్లు ఉన్నాయి, మొత్తం 14 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఈ సిరీస్ IMDBలో 10కి 8.2 రేటింగ్ ఉంది. ఇందులో చంచల్ చౌదరి ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. సయీద్ అహ్మద్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. గొప్ప సస్పెన్స్, మిస్టరీ సిరీస్ కావాలనుకుంటే ఈ సిరీస్ చూసేయ్యండి.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?




