Maadhavi Latha : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న అందాల భామ మాధవీలత..

రవిబాబు తెరకెక్కించిన నచ్చావులే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల భామ మాధవీలత. ఆ తర్వాత నాని నటించిన స్నేహితుడా సినిమాలో మెరిసింది

Maadhavi Latha : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న అందాల భామ మాధవీలత..
Madhavilatha
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 22, 2022 | 6:40 PM

Maadhavi Latha : రవిబాబు తెరకెక్కించిన నచ్చావులే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల భామ మాధవీలత. ఆ తర్వాత నాని నటించిన స్నేహితుడా సినిమాలో మెరిసింది ఈ అమ్మడు ఆతర్వాత ఎందుకనో మాధవీలత సినిమాలకు దురాంగా ఉంటూ వస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. గతంలో పలు వివాదాలపై మాధవీలత సోషల్ మీడియా వేదికగా స్పందించి వార్తల్లో నిలిచారు. ఆతర్వాత రాజకీయాలోకి కూడదా అడుగు పెట్టింది ఈ భామ. తాజాగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంది మాధవీలత.

ఈ ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో మొక్కలు నాటింది మాధవీలత . ఈ సందర్భంగా మాధవి లత మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు తమ ఇంటి వద్ద మొక్కలు నాటాలని ఆమె కోరారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు చాలా అవసరం అని చెట్లను కట్ చేయకుండా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి గ్రీనరి పెంచాలని మాధవీలత కోరారు.ఈ సందర్భంగా తన స్నేహితులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని మాధవి లత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: బూరెబుగ్గల బుజ్జాయి.. చిరునవ్వులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?

Nagashaurya: కృష్ణ వ్రింద విహారి అంటోన్న నాగశౌర్య.. బర్త్ డే వేళ స్పెషల్ సర్‏ప్రైజ్..

Manchu Lakshmi: తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ రిక్వెస్ట్.. ఎందుకంటే..