Keerthy Suresh: కోవిడ్ నుంచి కోలుకున్న కీర్తి సురేష్.. ఈరోజుల్లో నెగిటివ్ అంటే పాజిటివ్ ఆలోచన అంటూ..
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా కోవిడ్, ఓమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా కోవిడ్, ఓమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటి నిబంధనలు అమలు చేస్తున్నాయి. మరోవైపు సినిమా పరిశ్రమపై కరోనా మహామ్మరి మరోసారి కరోలు చాస్తుంది. సినీ తారలను కోవిడ్ ఏమాత్రం వదలడం లేదు. త్రిష, రాజేంద్రప్రసాద్, శోభన, మహేష్ బాబు, తాజాగా బిగ్ బాస్ బ్యూటీ సిరి సైతం కరోనా బారిన పడ్డారు. ఇటీవల మహేష్ ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) కూడా కరోనా నుంచి కోలుకున్నారు.
గత వారం రోజుల క్రితం హీరోయిన్ కీర్తి సురేష్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలు ఉండడంతో వైద్యుల సూచనలతో క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకున్నారు. దాదాపు వారం రోజుల తర్వాత కీర్తి సురేష్ కోవిడ్ నుంచి కోలుకున్నారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలుపుతూ ట్వీట్ చేశారు కీర్తి సురేష్. “ఈ రోజుల్లో నెగిటివ్ అంటే పాజిటివి విషయం . నాపై మీ అందరూ చూపించిన ప్రేమ, ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. అందరూ సంక్రాంతి పండగ రోజులను ఆనందంగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను ” అంటూ ట్వీట్ చేస్తూ.. తన ప్రస్తుత ఫోటోస్ షేర్ చేసుకుంది. దీంతో కీర్తి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ట్వీట్..
‘Negative’ can mean a positive thing these days. Grateful for all your love and prayers, hope you had a lovely Pongal and Sankaranthi! ?❤️ pic.twitter.com/Sop5wPfBA1
— Keerthy Suresh (@KeerthyOfficial) January 18, 2022
ప్రస్తుతం కీర్తి సురేష్ .. సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.
Radhe Shyam: మార్చిలో సందడి చేయనున్న రాధేశ్యామ్.? నెట్టింట వైరల్ అవుతోన్న విడుదల తేదీ..
Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్‌ల అందమైన లవ్ స్టోరీ..