RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో షాక్.. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, స్టార్ హీరో అజయ్ దేవగణ్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ యూట్యూబ్లో దూసుకుపోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా చరిత్రలో ఎప్పటికీ కలవని ఇద్దరూ వీరుల మధ్య స్నేహాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో దులో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోండగా.. ఎన్టీఆర్… గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు.
అయితే వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో సినిమాను వాయిదా వేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా పై వరుస కోర్టు కేసులు తలనొప్పిగా మారాయి. ఈ సినిమా ద్వారా చరిత్ర కథలను వక్రీకరిస్తున్నారని కొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయిస్తున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీపై కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తున్నారని అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవి పేట విలేకరులకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరిత్ర వక్రీకరణ జరిగిందని ఆరోపించరు.
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజును బ్రిటీష్ పోలీసుగా చూపడం దారుణమని పేర్కోన్నారు. ఈ విషయమై సినిమా మేకర్స్ పై సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని వివరించారు. అల్లూరి, కొమురం భీమ్ లు కలిసినట్టు చరిత్రలో లేదన్నారు. ఇప్పటికైనా అల్లూరి చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను తొలగించాలని పడాల డిమాండ్ చేశారు.
Radhe Shyam: మార్చిలో సందడి చేయనున్న రాధేశ్యామ్.? నెట్టింట వైరల్ అవుతోన్న విడుదల తేదీ..
Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్‌ల అందమైన లవ్ స్టోరీ..