Viral Photo: ఫ్రెండ్స్‌తో కలిసి ఫోటోకి పోజిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పటి స్టార్ హీరోయిన్..

ఫ్రెండ్స్‌తో కలిసి పెళ్లికూతురు గెటప్‌లో ఫోటోకి పోజిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఎవరో గుర్తుపట్టేందుకు కొంచెం కష్టంగా ఉందని అంటారా.?

Viral Photo: ఫ్రెండ్స్‌తో కలిసి ఫోటోకి పోజిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పటి స్టార్ హీరోయిన్..
Childhood Pic
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 18, 2022 | 12:16 PM

ఫ్రెండ్స్‌తో కలిసి పెళ్లికూతురు గెటప్‌లో ఫోటోకి పోజిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఎవరో గుర్తుపట్టేందుకు కొంచెం కష్టంగా ఉందని అంటారా.? అయితే మీకో చిన్న క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో.. ఆమె ఓ స్టార్ హీరోయిన్. తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

Childhood Pic 1 2

అటు గ్లామర్, ఇటు నటనతో ఆకట్టుకుని ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించింది. ఈ ముద్దుగుమ్మను ఫ్యాన్స్ ముద్దుగా గోవా బ్యూటీ అని పిలిచుకుంటారు. ఎస్.. మీరు అనుకుంటున్నట్లు ఈ ఫోటో మరెవరిదో కాదు ఇలియానాదే. ఈ గోవా బ్యూటీ చిన్నప్పుడు మస్తు అల్లరి చేసేదట. స్నేహితులతో కలిసి రచ్చ రచ్చ చేసేదట. ప్రస్తుతం ఇలియానా చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఇలియానా సినిమాల విషయానికొస్తే.. ‘దేవదాసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా.. ఆ తర్వాత ‘పోకిరి’, ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’ ‘మున్నా’ లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ‘ది బిగ్ బుల్’ సినిమాతో ఓటీటీలోకి అడుగుపెట్టిన ఇలియానా.. ‘అన్ ఫెయిర్ & లవ్లీ’, మరో హిందీ సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.

Childhood