అరెరె.. మంచి క్యారెక్టర్‌ మిస్‌ అయ్యారే.. ‘భద్ర’ సినిమాలో రవితేజ ఫ్రెండ్ పాత్రను వదులుకున్న నటులెవరో తెలుసా?

ఫ్యాక్షన్‌ బ్రాక్‌డ్యాప్‌కు ఎమోషనల్‌ లవ్‌ స్టోరీని జత చేసి భద్ర సినిమాను తెరకెక్కించారు బోయపాటి. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, ఈశ్వరి రావ్‌ తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో రవితేజ అన్నయ్యతో పాటు హీరోయిన్‌ మీరాకు అన్నయ్యగా ఓ కీలకమైన పాత్రలో నటించాడు దీపక్‌.

అరెరె.. మంచి క్యారెక్టర్‌ మిస్‌ అయ్యారే.. 'భద్ర' సినిమాలో రవితేజ ఫ్రెండ్ పాత్రను వదులుకున్న నటులెవరో తెలుసా?
Bhadra Movie
Follow us
Basha Shek

|

Updated on: Apr 11, 2023 | 5:19 PM

హీరోలను ఊరమాస్‌గా చూపించడంతో డైరెక్టర్‌ బోయపాటి శీనుది ప్రత్యేక శైలి. భద్ర, తులసి, సింహా, లెజెండ్‌, సరైనోడు, అఖండ.. ఇలా బోయపాటి కెరీర్‌లో ఎన్నో ఊరమాస్‌ హిట్‌ సినిమాలున్నాయి. కాగా బోయపాటికి తెలుగులో మంచి పునాది వేసిన చిత్రం భద్ర. ఇందులో రవితేజ హీరోగా , మీరా జాస్మిన్‌ హీరోయిన్‌గా నటించింది. ఫ్యాక్షన్‌ బ్రాక్‌డ్యాప్‌కు ఎమోషనల్‌ లవ్‌ స్టోరీని జత చేసి భద్ర సినిమాను తెరకెక్కించారు బోయపాటి. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, ఈశ్వరి రావ్‌ తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో రవితేజ అన్నయ్యతో పాటు హీరోయిన్‌ మీరాకు అన్నయ్యగా ఓ కీలకమైన పాత్రలో నటించాడు దీపక్‌. ఇందులో అతను పోషించిన రాజా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఝాన్సీ, దీపక్‌ కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సీన్లు అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే ప్రత్యర్థుల దాడిలో గాయపడి రవితేజ చేతిలో ప్రాణాలు కోల్పోవడం కంటతడి పెట్టిస్తుంది. ఇలా హీరో ఫ్రెండ్‌గానూ, హీరోయిన్‌ అన్నయ్యగానూ భలే సెట్‌ అయ్యాడు దీపక్.

కాగా రాజా పాత్రకు ముందుగా దర్శకుడి మనసులో వేరొకరు ఉన్నారట. ఆయన మరెవరో కాదు రాజీవ్ కనకాల. తను అయితేనే సినిమా బాగుంటుందని భావించారట. అయితే కనకాల అప్పటికే చాలా సినిమాల్లో బిజీబిజీగా ఉండడంతో భద్ర సినిమా కోసం డేట్స్‌ కేటాయించలేకపోయాడట. దీంతో ఆప్షన్‌ లేకపోవడంతో బోయపాటి హీరో శివాజీని అడిగారట. ఆయన కూడా డేట్స్‌ కుదరకపోవడంతో దీపక్‌ను అడిగారట. స్ర్కిప్ట్‌తో పాటు క్యారెక్టర్‌ నచ్చడంతో వెంటనే భద్ర సినిమాకు ఒప్పుకున్నారట దీపక్‌. కాగాతెలుగులో సంపంగి, నీతోడు కావాలి, ప్రేమ‌లో పావ‌ని క‌ళ్యాణ్‌ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ఆతర్వాత భద్ర, కింగ్‌, మిత్రుడు, అరుంధ‌తి సినిమాల్లోనూ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, సపోర్టివ్‌ రోల్స్‌లో మెరిశాడు. ప్రస్తుతం బాలీవు వెబ్‌ సిరీస్‌లలో నటిస్తున్నాడు.

Shivaji, Rajeev Kanakala

Shivaji, Rajeev Kanakala

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..