AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balagam: బలగం సింగర్‌ మొగిలయ్య పరిస్థితి విషమం.. హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ తలెత్తడంతో హైదరాబాద్‌కు తరలింపు

బలగం మూవీలో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించిన మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో మొగిలయ్య కొద్దిరోజులుగా వరంగల్‌ సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రస్తుతం హార్ట్‌ ప్రాబ్లమ్‌ కూడా రావడంతో హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు.

Balagam: బలగం సింగర్‌ మొగిలయ్య పరిస్థితి విషమం.. హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ తలెత్తడంతో హైదరాబాద్‌కు తరలింపు
Balagam Singers
Basha Shek
|

Updated on: Apr 11, 2023 | 3:47 PM

Share

బలగం మూవీలో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించిన మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో మొగిలయ్య కొద్దిరోజులుగా వరంగల్‌ సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రస్తుతం హార్ట్‌ ప్రాబ్లమ్‌ కూడా రావడంతో హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. దాంతో ఆయనను ఆదుకోవాలని వేడుకుంటోంది మొగిలయ్య భార్య కొమురమ్మ. మొగిలయ్య ఏడాది కాలంగా బీపీ, షుగర్‌తోపాటు రెండు కిడ్నీలు ఫెయిలై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వారానికి మూడుసార్లు వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకున్నాడు. అయితే.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డయాలసిస్‌ చేయడానికి మొగిలయ్య శరీరం సహకరించడం లేదని వైద్యులు చెప్పారు. దాంతో.. మొగిలయ్య కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. మనసున్న మారాజులు, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది. బలగం సినిమాలో క్లైమాక్స్‌ సాంగ్‌తో కోట్లాది మంది హృదయాలను కదిలించారు మొగిలయ్య- కొమురమ్మ దంపతులు. బలగం సినిమాతో మొగిలయ్య దంపతులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొగిలయ్యది వరంగల్‌ జిల్లా దుగ్గొండి. బుడగజంగాల సామాజికవర్గానికి చెందిన మొగిలయ్య దంపతులు.. బుర్ర కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు.

జబర్దస్త్ కమెడియన్‌ వేణు యెల్దండి మొదటిసారి మెగా ఫొన్‌ పట్టుకుని తెరకెక్కించిన చిత్రం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ ఎంతో ఎమోషనల్‌గా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. కాగా బలగం సినిమాకు క్లైమాక్స్ పాటే బలం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఆఖరులో వచ్చే ‘తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెల్లినావు కొమురయ్యా’ అని వచ్చే పాట అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ పాటలో నటించడమే కాదు అద్భుతంగా ఆలపించి తమ గొంతుతో ప్రాణం పోశారు వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. కాగా బుర్రకథలతో పొట్ట నింపుకునే మొగిలయ్య దంపతులపై కాలం కక్ష కట్టినట్లుంది. రెండేళ్ల క్రితం మొగిలయ్య కరోనా బారిన పడ్డారు. ఆతర్వాత కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయి. ఆతర్వాత షుగర్‌, బీపీ పెరగడంతో కంటి చూపు కూడా దెబ్బతింది. ఇప్పుడు గుండె సంబంధిత సమస్యలు రావడంతో మొగిలయ్య భార్య కొమురమ్మ కన్నీరు మున్నీరవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు వెంకటేశ్ పారితోషికం ఇదే.. 
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు వెంకటేశ్ పారితోషికం ఇదే.. 
డోర్స్‌, విండో ట్రాక్‌లు ఎప్పుడూ మెరిసేలా ఉండాలా? ఈ సూపర్ ఐడియాస్
డోర్స్‌, విండో ట్రాక్‌లు ఎప్పుడూ మెరిసేలా ఉండాలా? ఈ సూపర్ ఐడియాస్
రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.80వేల ఆదాయం..ఈ బిజినెస్ గురించి..
రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.80వేల ఆదాయం..ఈ బిజినెస్ గురించి..
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
ఆ షోలో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు..
ఆ షోలో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు..
బడ్జెట్ వేళ కేంద్రం గుడ్‌న్యూస్.. వారికి నెలనెలా రూ.5 వేల పెన్షన్
బడ్జెట్ వేళ కేంద్రం గుడ్‌న్యూస్.. వారికి నెలనెలా రూ.5 వేల పెన్షన్
అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా..
అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా..
పిల్లల చదువుకు శుభారంభం.. వసంత పంచమి అక్షరాభ్యాస ముహూర్తం ఇదే!
పిల్లల చదువుకు శుభారంభం.. వసంత పంచమి అక్షరాభ్యాస ముహూర్తం ఇదే!