AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simbu: ఆ తెలుగు స్టార్ హీరోయిన్‌తో పెళ్లిపీటలెక్కనున్న శింబు! త్వరలోనే ఎంగేజ్‌మెంట్!

ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరైన శింబుకు తెలుగులోనూ బోలెడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. 41 ఏళ్ల శింబు ఇప్పటికీ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ గానే లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. నయనతార, హన్సికతో ప్రేమాయణాలు నడిపినా ఏవీ పెళ్లి వరకు రాలేదు. ఇక మరో స్టార్ హీరోయిన్

Simbu: ఆ తెలుగు స్టార్ హీరోయిన్‌తో పెళ్లిపీటలెక్కనున్న శింబు! త్వరలోనే ఎంగేజ్‌మెంట్!
Simbu
Basha Shek
| Edited By: |

Updated on: Sep 29, 2024 | 10:01 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సీనియర్‌ దర్శక, నటుడు, నిర్మాత టి.రాజేందర్‌ వారుసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతను మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా, గీత రచయితగా, సంగీతదర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరైన శింబుకు తెలుగులోనూ బోలెడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. 41 ఏళ్ల శింబు ఇప్పటికీ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ గానే లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. నయనతార, హన్సికతో ప్రేమాయణాలు నడిపినా ఏవీ పెళ్లి వరకు రాలేదు. ఇక మరో స్టార్ హీరోయిన్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తో శింబు డేటింగ్ చేస్తున్నట్లు ఆ మధ్యన ప్రచారం సాగింది. 2021లో శింబు హీరోగా నటించిన ఈశ్వరన్ లో నిధి హీరోయిన్ గా నటించింది. అప్పటి నుంచే వీరు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగింది. అయితే క్రమంగా కొద్ది రోజులకు ఇది కూడా రూమర్ గానే మిగిలిపోయింది. అయితే తాజాగా మళ్లీ శింబు, నిధి అగర్వాల్‌ డేటింగ్‌ వ్యవహారం తెర మీదకు వచ్చింది. అంతేకాదు ఈ సారి వీరు పెళ్లి కూడా చేసుకోనున్నారని టాక్ నడుస్తోంది. శింబు, నిధిల ప్రేమను ఇరు పెద్దలు కూడా ఆశీర్వదించారని సమచారం. త్వరలోనే ఈ ప్రేమ పక్షుల ఎంగేజ్ మెంట్ జరగనుందని, ఆ వెంటనే పెళ్లి కూడా జరగనుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

అయితే శింబు, నిధి అగర్వాల ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. మరి వీటిలో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల శింబు నటించిన మానాడు, పాతుతల సినిమాలుసూపర్ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న థగ్ లైఫ్ లో కీలక పాత్ర పోషిస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. మణిరత్నం తెరకెక్కిస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో శింబు డబుల్ రోల్ లో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..