Anupama Parameswaran: మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో రానున్న అనుపమ.. ఈసారి రియల్ స్టోరీతో..

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.. తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మడు తెలుగులో చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఈ చిన్నది లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారి రియల్ స్టోరీతో రానుంది అనుపమ పరమేశ్వరన్..

Anupama Parameswaran: మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో రానున్న అనుపమ.. ఈసారి రియల్ స్టోరీతో..
Anupama Parameswaran
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 20, 2024 | 4:14 PM

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఆచి తూచి సినిమాలు చేస్తుంది. హీరోయిన్ గా ఒకొక్క పెట్టు ఎక్కుతూ వస్తున్న అనుపమ పరమేశ్వరన్ కెరీర్ బిగినింగ్ లో గ్రామర్స్ రోల్స్ కు దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఆతర్వాత టిల్లు స్క్వేర్ సినిమాలో మాత్రం తన అందాలతో ఆకట్టుకుంది. ఓ రేంజ్ లో అందరు ఆరబోసి అభిమానులను కవ్వించింది ఈ కుర్రది. ఇక ఈ అమ్మడు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తోనూ ఆకట్టుకుంటుంది. ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటుంది ఈ అమ్మడు. తాజాగా అనుపమ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి :అప్పుడు బాడీ షేమింగ్ అవమానాలు.. ఇప్పుడు నోరెళ్ళబెట్టి చూసే సోయగం.. స్టార్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ

సూపర్ స్టార్ సురేష్ గోపి అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మాతగా ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న యదార్థ సంఘటనల ఆధారంగా వాస్తవిక దృక్పధ కోణంలో తీసిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (జె. ఎస్. కె). బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇంటెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇది కూడా చదవండి :Venu Swamy: నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యింది.. ఇంకా జరుగుతాయి

అనుపమ పరమేశ్వరన్ సినిమాలో జానకి పాత్రలో నటిస్తోంది. యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జానకి పై జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొంది అన్న అంశాన్ని ఇంటెన్స్ డ్రామాగా నిర్మించారు. ఈ కేసును వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి గారు నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.