Kantara Chapter 1: కాశీలో హీరో రిషభ్ శెట్టి ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్.. ఎందుకో తెలుసా?
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార: చాప్టర్ 1 బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక కాంతార ఛాప్టర్ 1 విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు హీరో రిషబ్ శెట్టి.

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార: చాప్టర్ 1. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించింది. అలాగే బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య మరో కీలక పాత్రలో కనిపించారు. దసరా కానుకగా రిలీజైన ఈ సినిమా కేవలం 16 రోజుల్లోనే రూ. 717 కోట్ల కలెక్షన్లు సాధించింది. తద్వారా కన్నడ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా రికార్డుల కెక్కింది. కేజీఎఫ్-2 మొదటి స్థానంలో ఉంది. ఇక కాంతార ఛాప్టర్1 విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు హీరో రిషబ్ శెట్టి. సినిమాను మరింత ప్రమోట్ చేస్తూ ప్రధాన నగరాలన్నీ చుట్టేస్తున్నాడు. ఈ క్రమంలోనే కాంతార ఛాప్టర్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో వారణిసి వెళ్లాడు రిషభ్ శెట్టి. అక్కడ కుటుంబ సమేతంగా పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నాడు. ప్రత్యేక పూజలు కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
కాంతారా: చాప్టర్ 1′ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన హిందీ చిత్రం ‘ఛావా’ ప్రపంచవ్యాప్తంగా రూ. 830 కోట్లు వసూలు చేసింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. కానీ ఇప్పుడు రిషబ్ చిత్రం ‘ఛావా’ ఆ రికార్డును బద్దలు కొట్టి నంబర్ 1 స్థానానికి చేరుకునే దిశగా దూసుకుపోతోంది. ‘ఛావా’ ఓవరాల్ గా రూ. 830 కోట్లు వసూలు చేసింది. కానీ ‘కాంతార: చాప్టర్ 1’ కేవలం రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లు వసూలు చేసింది. ఈ దీపావళి ముగిసే నాటికి ‘కాంతార: చాప్టర్ 1’ ఈ సంవత్సరం విడుదలైన అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరిస్తుంది. అంతే కాదు, రూ. 1000 కోట్ల మైలురాయిపై కూడా దృష్టి సారించనుంది. ఈ సంవత్సరం విడుదలైన ఏ సినిమా కూడా వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేయలేదు. ‘కాంతార: చాప్టర్ 1’ కలెక్షన్ స్పీడ్ చూస్తుంటే, రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
వీడియో ఇదిగో..
Sanatan 🚩🙏#RishabShetty attends Ganga aarti and seeks divine blessings on his spiritual visit to Varanasi.@shetty_rishab expressed his thanks and gratitude to Maa Ganga for #KantaraChapter1’s massive success. 🙌 pic.twitter.com/Meu9Rsls0f
— Ashwani kumar (@BorntobeAshwani) October 17, 2025
‘కాంతార: చాప్టర్ 1’ కర్ణాటకలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా గొప్ప కలెక్షన్లను సాధిస్తోంది. హిందీ ప్రాంతాలలో, ‘కాంతార: చాప్టర్ 1’ కలెక్షన్ రూ. 150 కోట్లు దాటి, వేగంగా రూ. 200 కోట్లకు చేరుకుంటోంది. తమిళనాడులో రూ. 50 కోట్ల కలెక్షన్లను దాటేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటికే రూ. 100 కోట్లు వసూలు చేసింది. కేరళలో కూడా కలెక్షన్లు బాగున్నాయి. ఇప్పుడు వారాంతపు, దీపావళి సెలవులు వచ్చాయి కాబట్టి, ‘కాంతార: చాప్టర్ 1’ కలెక్షన్లు మరింత పెరుగుతాయని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








