Dhamaka: ‘ధమాకా’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. మాస్ మాహారాజా హిట్టు కొట్టేలా ఉన్నాడుగా..
ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా వినాయక చవితి సందర్భంగా ధమాకా సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్.

మాస్ మాహారాజా రవితేజ (Raviteja) చాలా కాలం తర్వాత క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు. కరోనా సంక్షోభం తర్వాత విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలవడమే కాకుండా భారీగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత విడుదలైన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు మాస్ మహారాజా ఆశలన్నీ ధమాకా (Dhamaka) సినిమానే ఉన్నాయి. డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా వినాయక చవితి సందర్భంగా ధమాకా సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్.
ముందుగా అనౌన్స్ చేసినట్లుగానే ఈరోజు సాయంత్రం రొమాంటిక్ గ్లింప్స్ విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో కథానాయిక శ్రీలీలతో రవితేజ యాక్టింగ్ అదిరిపోయింది. మాస్ మాహారాజా నటన నవ్వులు పూయిస్తుండగా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే ఈసారి రవితేజ హిట్టు పడ్డట్టే అంటున్నారు ఫ్యాన్స్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.




ఫస్ట్ గ్లింప్స్..
#Dhamaka Easy-Breezy Romantic Glimpse❤️https://t.co/pPH13E86Sk #DhamakaDoubleImpact@RaviTeja_offl @sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada #KarthikGattamneni @PrawinPudi @ceciroleo@OfficialSekhar @SunilOfficial @RajaS_official pic.twitter.com/Muq8ai9eyu
— People Media Factory (@peoplemediafcy) August 31, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.