తాగి మాట్లాడుతున్నావా అన్న..? రానాకు షాక్ ఇచ్చిన అభిమానులు..
లాస్ట్ దివాలీ రేస్‌లో సూపర్ డూపర్ సినిమాగా మార్కులు కొట్టేసిన సినిమా లక్కీ భాస్కర్. ఏం తీశార్రా అనిపించేలా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిందీ మూవీ. పీరియాడిక్ టచ్ ఉన్న రోల్‌లో సూపర్బ్ గా చేశారు దుల్కర్. అప్పటిదాకా ఎక్కడో మలయాళ స్టార్ అన్న ఫీల్‌ని ఈ మూవీతో పూర్తిగా తుడిచిపెట్టేసి… దుల్కర్ మనోడే అనిపించుకున్నారు.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. నిజానికి తెలుగులో దుల్కర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు కాంత అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు దుల్కర్. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో బాగ్యా శ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా విభిన్నమైన కథతో తెరకెక్కింది. నవంబర్ 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.. దానికి రానా గెస్ట్ గా హాజరయ్యారు.
ఐదు లక్షల కట్టి అద్దె ఇంట్లో ఉండేది.. నోట్లకట్టలపై నిద్ర.. కట్ చేస్తే అనాథలా
ఈ ప్రెస్ మీట్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రానా ఈ సినిమా గురించి మాట్లాడుతుండగా అభిమానులు ఒక్కసారిగా కేకలు వేయడం మొదలు పెట్టారు. చాలా రోజుల తర్వాత రానా ఇలా స్టేజ్ పై కనిపించడంతో అభిమానులు గట్టిగానే ఉత్సాహం చూపించారు. ఇక రానా మాట్లాడుతూ దుల్కర్ సల్మాన్ గురించి సినిమా గురించి గొప్పగా చెప్పారు. కాగా రానా మాట్లాడుతుండగా కొందరు అభిమానులు “తాగి మాట్లాడుతున్నావా అన్న.?” అంటూ గట్టిగా అరవడంతో రేయ్.. మద్యం మత్తులో మాట్లాడలేదు రా.. ఏదో చిన్నప్పటి జ్ఞాపకాలు మీతో మాట్లాడమనుకున్నాను.. నన్ను మాట్లాడనివ్వండి అని సరదాగా అంటూ తన స్పీచ్ ను కంటిన్యూ చేశారు.
చేసింది నాలుగు సినిమాలు.. రెండు హిట్స్ .. రెండు ఫ్లాప్స్..! కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి మాయమైంది
రానా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక కాంతా సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాకు సెల్వ రాజు దర్శకత్వం వహించగా, స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఝును సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 14న కాంత సినిమా విడుదలకానుంది.
50ఏళ్ల వయసులో ఇవేం కోరికలు తల్లి.. ఆ యవ్వారానికి పెళ్లితో పనేముందన్న హాట్ బ్యూటీ
రానా ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




