Karthikeya-2: కార్తికేయ 2 నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. టీజర్ రిలీజ్ చేసేది ఎప్పుడంటే..
సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddarth) ఒకరు.. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ యంగ్ హీరో.. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా.. అర్జున్ సురవరం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు నిఖిల్. ప్రస్తుతం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. అందులో కార్తికేయ 2 ఒకటి.. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి (Karthikeya 2). ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ జూన్ 24న విడుదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్.. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇచ్చారు మేకర్స్. మోషన్ పోస్టర్లో ఆసక్తికరమైన విషయం డాక్టర్ కార్తికేయ ప్రయాణం. శ్రీకృష్ణుడు చరిత్రలోకి ఎంటరవుతూ కనిపిస్తున్నారు ఈయన. ఈ చిత్రంలోని భావాన్ని మోషన్ పోస్టర్ రూపంలో దర్శకుడు చందు మొండేటి ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చూపించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 22న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది కార్తికేయ 2. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాతోపాటు.. నిఖిల్ 18 పేజెస్, స్పై చిత్రాల్లో నటిస్తున్నారు.
Karthikeya2 1st Trailer this June 24th… Very Very Excited to finally reveal the visuals from the movie to you all this Saturday… just a few more days…. Love to all ❤️❤️ #Karthikeya2teaser #Karthikeya2Trailer1 @anupamahere @chandoomondeti @AAArtsOfficial @peoplemediafcy pic.twitter.com/KPvII4GHGZ
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 21, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.