Actor Nani : బిగ్ బాస్ 9 హోస్టింగ్ పై నాని రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే..
న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు హిట్ 3 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఊహించని రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ శైలేష్ కొలను తెరెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ 9 హోస్టింగ్ పై నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. దేశవ్యాప్తంగా ఈ షోకు మంచి ఆదరణ ఉంటుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ షో ఇప్పటికే పలు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. అయితే తెలుగులో బిగ్ బాస్ షో మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రారంభంలోనే విపరీతమైన టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుని సక్సెస్ అయ్యింది ఈ షో. ఇప్పటికీ 8 సీజన్స్ కంప్లీట్ అయినప్పటికీ ది బెస్ట్ సీజన్ అంటే మాత్రం ఫస్ట్ సీజన్ అంటుంటారు నెటిజన్స్. తొలి సీజన్ తర్వాత తారక్ ఈ షో నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ సీజన్ కు న్యాచురల్ స్టార్ వ్యాఖ్యతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ధైర్యం చేసి యాంకర్ గా మారాడు నాని. అప్పట్లో నాని తనదైన యాంకరింగ్ ద్వారా ప్రేక్షకులను అలరించినప్పటికీ.. పలు సందర్భాల్లో విమర్శలు సైతం వచ్చాయి.
ఇక నాని తర్వాత మూడో సీజన్ నుంచి ఇప్పటివరకు అక్కినేని నాగార్జున బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్టింగ్ చేస్తున్నారు. అయితే త్వరలోనే ప్రారంభం కానున్న 9వ సీజన్ కు తెలుగులో హోస్ట్ మారుతున్నారంటూ ప్రచారం నడుస్తుంది. బిగ్ బాస్ షో నుంచి నాగ్ తప్పుకున్నారని.. దీంతో ఆయన స్థానంలోకి విజయ్ దేవరకొండ లేదా రానా రానున్నారంటూ టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత రాలేదు. రానా, విజయ్ దేవరకొండతోపాటు నందమూరి బాలకృష్ణ పేరు సైతం తెరపైకి వచ్చింది. వీరితోపాటు మరోసారి న్యాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్ట్ గా మారానున్నారనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ రూమర్స్ పై రియాక్ట్ అయ్యారు నాని. తన జీవితంలో బిగ్ బాస్ చాప్టర్ ముగిసిపోయిందని.. ఇక దాని జోలికి వెళ్లే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టారు నాని.
ఇటీవల హిట్ 3 ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని బిగ్ బాస్ సీజన్ 9 హోస్టింగ పై రియాక్ట్ అయ్యారు. “బిగ్ బాస్ రియాల్టీ షో బయటి ప్రపంచం ఎలా ఉంటుందనేది నాకు కళ్లకు కట్టినట్లుగా చూపించింది. నన్ను మరింత బలంగా మార్చింది. ఒక గేమ్ షో అనుకుని వెళ్లాను.. కానీ ఆ గేమ్ వెనకాల ఇన్ని ఎమోషన్స్ ఉంటాయా ? అనిపించింది. అయితే చాలా మంది అభిప్రాయాలు షో అయిపోగానే మారిపోతాయి. నా జీవితంలో బిగ్ బాస్ చాప్టర్ ముగిసింది. మళ్లీ హోస్ట్ చేయడం జరగని పని. ఈ మాట ఇప్పుడు కాదు.. సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్ రోజునే చెప్పాను.. ఆ షోలో ఉన్నప్పుడు వారి గురించి ఒకలా అనుకుంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోతుంది. ఒక షోను చూసి జనం ఎంత రియాక్ట్ అవుతున్నారు.. ? చూసే విధానాన్ని మార్చేసింది బిగ్ బాస్. అలాంటి షోకు మళ్లీ హోస్ట్ గా జీవితంలో వెళ్లను” అంటూ చెప్పుకొచ్చారు నాని.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..