- Telugu News Photo Gallery Cinema photos Tollywood hereoins likes Sreeleela Rashmika Mandanna not getting more chances in bollywood
బాలీవుడ్ లో నిలదొక్కుకోలేక పోతున్న మన భామలు.. కారణం అదేనట..
వీసా రావడం.. టిక్కెట్ బుక్ చేసుకోవడం.. అక్కడ ల్యాండ్ కావడం ఎంత ఇంపార్టెంటో, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్.. అంతేనా..! సేమ్ టు సేమ్ ఇలాంటి మాటలు బాలీవుడ్‌లో హీరోయిన్లు నిలదొక్కుకునే విషయంలోనూ వినిపిస్తుంటాయి..! నార్త్ లో రష్మిక నిలదొక్కుకోవడానికి ట్రయల్స్ వేస్తున్నప్పుడు ఎన్నో రకాలుగా ట్రోలింగ్స్ కి గురయ్యారు.
Updated on: May 07, 2025 | 7:58 PM

నార్త్ లో రష్మిక నిలదొక్కుకోవడానికి ట్రయల్స్ వేస్తున్నప్పుడు ఎన్నో రకాలుగా ట్రోలింగ్స్ కి గురయ్యారు. కాస్ట్యూమ్స్ మీద, మేనరిజమ్స్ మీద రకరకాల వార్తలు వినిపించాయి.

యానిమల్‌తోనూ ఆ తర్వాత ఛావాతోనూ నేషనల్ క్రష్ నార్త్ లో ప్రూవ్ చేసుకోగలిగారని హ్యాపీగా కనిపించారు ఫ్యాన్స్. కానీ సికందర్ వారి ఆనందం మీద నీళ్లు చల్లేసింది. పూజా హెగ్డే లాగా రష్మిక కూడా ఇప్పుడు హిట్ కోసం వెయిట్ చేస్తున్న లిస్టులో కనిపిస్తున్నారు.

తెలుగు లేడీ శ్రీలీల కూడా నార్త్ లో లిట్మస్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు. అక్కడ కార్తిక్ ఆర్యన్‌తో కలిసి నటిస్తున్న సినిమా క్లిక్ కావాలి.. ఆ తర్వాత వరుస హిట్లు పడాలి. అప్పుడే బాలీవుడ్ భామ అనే స్టేటస్ దక్కుతుందన్న విషయంలో క్లారిటీగానే ఉన్నారు శ్రీలీల.

కీర్తీ సురేష్ కూడా వింత పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. బేబీ జాన్ హిట్ అంచులదాకా వచ్చి ఆగిపోయిందనే మాట ఆ నోటా ఈ నోటా దాటి.. మేకర్స్ నోటే వినిపిస్తోంది. ఈ సమయంలో కీర్తీ సురేష్ బాలీవుడ్ భవిష్యత్ మీద డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి.

జవాన్‌తో సూపర్బ్ అనిపించుకున్న నయన్ కూడా ఆ తర్వాత ముంబై వీధుల్లో పెద్దగా కనిపించలేదు. సంజయ్ లీలా భన్సాలీతో సినిమా ఉంటుందన్నారు కానీ, అదీ చడీ చప్పుడు లేదు.. సో, వీటన్నిటినీ బట్టి.. ఒక్క హిట్టూ, అర హిట్టూ కాదు.. వరుస హిట్లు పడితేనే.. మన హీరోయిన్లకు బాలీవుడ్ భామలనే ట్యాగ్ దక్కేది.




