Chiranjeevi: డ్యాన్సుల్లో మెగాస్టార్‌కి ఇన్‌స్పిరేషన్ ఆ హీరోనట..
మంచి ఎక్కడున్నా తీసుకోవాలి. ఇన్‌స్పయిర్ కావాలి. ఫాలో అవ్వాలి. మంచి రిజల్ట్స్ చూడాలి.. ఇదన్నమాట కాన్సెప్ట్. అచ్చం ఇదే టాపిక్ గురించి మెగాస్టార్, విక్టరీ హీరో స్పందించారు. ఇంతకీ వాళ్లేమన్నారు.. వాళ్లకు నచ్చినట్టు చెప్పినవారెవరు? వేవ్స్ సమ్మిట్‌లో పార్టిసిపేట్ చేశారు చిరంజీవి. ఇండియన్ సినిమా సెలబ్రిటీలు పలువురు పాల్గొన్న ఈ సమ్మిట్‌లో చిరు
Updated on: May 07, 2025 | 7:58 PM

మంచి ఎక్కడున్నా తీసుకోవాలి. ఇన్‌స్పయిర్ కావాలి. ఫాలో అవ్వాలి. మంచి రిజల్ట్స్ చూడాలి.. ఇదన్నమాట కాన్సెప్ట్. అచ్చం ఇదే టాపిక్ గురించి మెగాస్టార్, విక్టరీ హీరో స్పందించారు. ఇంతకీ వాళ్లేమన్నారు.. వాళ్లకు నచ్చినట్టు చెప్పినవారెవరు?

వేవ్స్ సమ్మిట్‌లో పార్టిసిపేట్ చేశారు చిరంజీవి. ఇండియన్ సినిమా సెలబ్రిటీలు పలువురు పాల్గొన్న ఈ సమ్మిట్‌లో చిరు మాట్లాడుతూ మిథున్, కమల్, అమితాబ్ తనకు స్ఫూర్తి పంచారన్నారు.

కమల్‌హాసన్ నటన గురించి ఎంత మంది మాట్లాడుతారో, ఆయన డ్యాన్సుల గురించి కూడా అంతే గొప్పగా మెన్షన్ చేసేవాళ్లుంటారు. లేటెస్ట్ గా ఆ విషయాన్నే ప్రస్తావించారు మెగాస్టార్ చిరంజీవి. తనకు కమల్ డ్యాన్సులంటే ఇష్టమని చెప్పారు.

మెగాస్టార్ వాళ్లందరి గురించి చెబితే... విక్టరీ వెంకటేష్ రజనీకాంత్‌ని గుర్తుచేసుకున్నారు. జీవితంలో ఎంత పెద్ద హిట్, ఫ్లాప్‌ను చూసినా మనసుకు తీసుకోవద్దని సూపర్‌స్టార్ చెప్పిన విషయాన్ని రీకలెక్ట్ చేసుకున్నారు వెంకటేష్.

ఇవాళ్టికీ తాను కలెక్షన్ల గురించి పట్టించుకోనన్నారు. లైఫ్‌లో ఇతరులను చూసి తమ అభిమాన స్టార్స్ ఇన్‌స్పయిర్ అయిన తీరు గురించి ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు.




