- Telugu News Photo Gallery Cinema photos Do you know who is the senior actress who acted with four Chief Ministers?
నలుగురు ముఖ్యమత్రులతో కలిసి నటించిన అందాల తార ఎవరో తెలుసా?
సీనియర్ తారల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కాలంలో మహానటి సావిత్రి, జమున, కృష్ణ కుమారి, షావుకారు జానకి వీరందరూ చాలా మంది సీనియర్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా తమ నటనతో నేటి తరం నటీమణులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే అందులో ఓ నటి ఏకంగా నలుగురు ముఖ్యమత్రులతో నటించింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే?
Updated on: May 07, 2025 | 7:59 PM

తన నటన, కొంటె తనం, అందంతో ఎంతో మందిని ఆకట్టుకున్న నటీమణుల్లో షావుకారు జానకి ఒకరు. ఈ తార గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా భాషల్లో నటించి, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ హీరోయిన్ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. ఇంతకీ వారు ఎవరంటే?

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో షావుకారు జానకి 400లకు పైగా సినిమాలు చేసింది. అందులో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నందమూరి తారకరామారావు గారితో ఈ హీరోయిన్ చాలా సినిమాల్లో నటించింది.

అదే విధంగా షావుకారు జానకి తమిళంలో చాలా సినిమాలు చేసింది. ఈ నటికి ఇప్పటికీ అక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా మంది ఈ హీరోయిన్‌ను గౌరవిస్తుంటారు. అయితే తమిళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఏంజీ రామ్ చంద్రన్‌తో కలిసి ఈ నటి సినిమాలు చేశారు.

అలాగే తమిళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వారిలో కరుణానిధి ఒకరు. ఈయనతో కలిసి కూడా షావుకారు జానకి పలు సినిమాలు చేశారు. అంతే కాకుండా ఈ నటి చేసిన చాలా వరకు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి.

ఇక తమిళ రాష్ట్రానికి ఓ నటి కూడా ముఖ్యమంత్రిగా చేశారు. ఆమె జయలలిత. ఈ నటి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే జయలలిత, షావుకారు జానకి కలిసి కూడా ఓ సినిమాలో నటించారు. అలా షావుకారు జానకి నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించింది.



