స్పీడ్ పెంచిన నాగ చైతన్య… మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏కు ఓకే చెప్పిన చైతు.. త్వరలోనే సెట్స్ పైకి ?

అక్కినేని నాగ చైతన్య సినిమాల ఎంపికలో స్పీడ్ పెంచాడు. ఒకప్పుడు స్లోగా సినిమాలు చేసే చైతు, ప్రస్తుతం గ్యాప్ లేకుండా మూవీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

స్పీడ్ పెంచిన నాగ చైతన్య... మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏కు ఓకే చెప్పిన చైతు.. త్వరలోనే సెట్స్ పైకి ?
Naga Chaitanya

అక్కినేని నాగ చైతన్య సినిమాల ఎంపికలో స్పీడ్ పెంచాడు. ఒకప్పుడు స్లోగా సినిమాలు చేసే చైతు, ప్రస్తుతం గ్యాప్ లేకుండా మూవీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాను పూర్తి చేశాడు చైతు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ లో కూడా మొన్నటి వరకూ పాల్గోన్నాడు. థాంక్యూ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. Naga Chaitanya

అలాగే నాగ చైతన్య బాలీవుడ్ లో కూడా అరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా రానున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో చైతు నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర 18 నిమిషాల పాటు ఉంటుందని.. ఒక తెలుగు కుర్రాడి పాత్రలో చైతు కనిపించబోతున్నాడని మొత్తానికి ఇదొక గెస్ట్ రోల్ అని టాక్ వినిపిస్తోంది. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ లడఖ్ లో మొదలు కానుంది. తాజాగా చై మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నాగశౌర్యతో ‘ఛలో’, నితిన్‌తో ‘భీష్మ’ సినిమాలు రూపొందించిన వెంకీ కుడుములతో నాగచైతన్య సినిమా చేస్తున్నాడని సమాచారం. Venky Kudumula  అయితే ఇప్పటికే వెంకి కుడుముల.. నాగ చైతన్యకు స్టోరీ వినిపించాడని.. దీనికి చై కూడా ఓకే చెప్పినట్లుగా టాక్. మరోసారి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండే సినిమాను వెంకీ.. నాగచైతన్య కోసం సిద్ధం చేసుకున్నాడట. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా టాక్.

Also Read: నెటిజన్లపై మండిపడ్డ రేణు దేశాయ్.. పిచ్చి పిచ్చి మెసేజీలు ఆపండి.. మిగతవాళ్ళ ప్రాణాలు పోతున్నాయ్ అంటూ ఫైర్..

Covid Care: కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చా ? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

పసుపు పాలతో తాగితే బరువు తగ్గుతారా ? వెయిట్ లాస్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే..