Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Care: కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చా ? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

Covid Care: కంటికి కనిపించిన అతి చిన్న సూక్ష్మ జీవి.. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు రూపు మార్చుకోని రెండో దశ రూపంలో

Covid Care: కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చా ? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
Corona Virus
Follow us
Rajitha Chanti

|

Updated on: May 18, 2021 | 3:35 PM

Covid Care: కంటికి కనిపించిన అతి చిన్న సూక్ష్మ జీవి.. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు రూపు మార్చుకోని రెండో దశ రూపంలో భారత్‏ను అతలాకుతలం చేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఈ వైరస్ ప్రతి ఒక్కరిని బలి తీసుకుంటుంది. ఇక తల్లిపాల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తోందనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ.. తమ పిల్లలకు పాలు ఇవ్వోచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు తమ బిడ్డలకు దూరంగా ఉండడం.. పాలు ఇవ్వడం మానుకున్నారు. అయితే తల్లులు తమ పిల్లలకు ఆహారం ఇచ్చేందుకు మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తూ తల్లిపాలు ఇవ్వోచ్చు అని డాక్టర్లు సూచిస్తున్నారు. తల్లిపాలలో అందే పోషకాహారం, రోగనిరోధక శక్తిని, బలాన్ని ఇతర పాలతో భర్తీ చేయలేమని డాక్టర్లు చెప్పారు. ఇప్పటివరకు 90 శాతం మంది తమ రోగులు కోలుకుంటున్నారని తెలిపారు.

అయితే తల్లిపాల ద్వారా పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని సూచిస్తున్నాయి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కమ్యూనికేషన్ ప్రకారం.. నేషనల్ నియోనాటాలజీ ఫోరం (ఎన్ఎన్ఎఫ్) తెలంగాణ అధ్యాయనం ఆదివారం నిర్వహించిన వర్చువల్ ప్రెస్ మీట్ సందర్బంగా హైదరాబాద్ కు చెందిన స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు కూడా తల్లిపాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అధారాలు లేవని స్పష్టం చేశారు.

నీలోఫర్ హాస్పిటల్లోని పీడియాట్రిక్స్ విభాగం అధిపతి టీ.ఉషారాణి మాట్లాడుతూ.. కరోనాతో ప్రత్యామ్నాయ పాల వనరులను ఎన్నుకునే కొత్త సమస్య తల్లులు మొదటి దశలో గమనించాము. వారిలో కొందరు ఇప్పుడు కౌన్సిలింగ్ తో నమ్మకం ఏర్పర్చుకున్నారు. కోవిడ్ ఉన్న తల్లులు మాస్క్ లు ధరించడం.. చేతులు కడుక్కోవడం, ఆహారం ఇచ్చిన తర్వాత శిశువుకు ఆరు అడుగుల దూరంలో ఉండడం వంటి జాగ్రత్తలు పాటించాలని.. అలాగే పిల్లలకు పాలివ్వాలని సలహా ఇస్తున్నాము. ఈరోజు వరకు వైరస్ తల్లి నుంచి బిడ్డకు తల్లిపాల ద్వారా వ్యాపిస్తుందని సూచించే ఆధారాలు లేవు. తల్లిపాల ద్వారా శిశువలకు బాల్యంలోనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని ఎన్ఎన్ఎఫ్ తెలంగాణ అధ్యాయం మాజీ అధ్యక్షురాలు ఉషారాణి అన్నారు.

శుభ్రతలు.. రోజులో ఒక్కసారి స్నానం చేస్తే సరిపోతుందని డాక్టర్లు సూచిస్తారు. పదే పదే చేయడం కూడా మంచిది కాదని చెప్పారు. తెలంగాణ చాప్టర్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీనివాస్ ముర్కి, గాంధీ ఆసుపత్రిలో ప్రసూతి, గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ టీ. విజయ కృష్ణ కూడా కొత్త తల్లులకు కూడా జాగ్రత్తలు పాటించడం ద్వారా తల్లిపాలు ఇవ్వాలని తెలిపారు. ఎల్లప్పుడూ మాస్క్ ధరించడం.. పిల్లలకు ఆరు అడుగుల దూరంలో ఉంటూ.. ఒకే గదిలో ఉండవచ్చని తెలిపారు. మాస్క్ ధరించిన తర్వాత పదే పదే రొమ్ము మీద, దగ్గు లేదా తుమ్మినప్పుడు పదే పదే శుభ్రం చేయాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలను చూసుకోవాలని తెలిపారు.

డాక్టర్ విజయ కృష్ణ మాట్లాడుతూ.. గర్బిణీలు ఎల్లప్పుడూ మాస్క్ ధరించడం.. చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. గర్బిణీ స్త్రీలకు ఆరోగ్య అత్యవసర పరిస్థితి లేదా ఏదైనా సమస్య ఉంటే తప్ప డాక్టర్ల వద్దకు వెళ్లాలని.. లేని సమయంలో ఇంట్లోనే ఉండాలని సూచించారు. డాక్టర్లతో మొబైల్ లో సలహాల తీసుకోవాలని చెప్పారు.

Also Read: పండ్లు, కూరగాయలు తినడం వలన ఒత్తిడి ఫసక్… అధ్యయనాల్లో వెలువడిన సంచలన విషయాలు..

పసుపు పాలతో తాగితే బరువు తగ్గుతారా ? వెయిట్ లాస్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే..