Health Insurance: కరోనా సంక్షోభంలో పెరిగిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు.. 25-30 శాతం పెరిగిన బీమా ప్రీమియంలు..!

Health Insurance: ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో ఆరోగ్య బీమా చేసుకునే వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కరోనా కాలంలో ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీమా పాలసీలు.

Health Insurance: కరోనా సంక్షోభంలో పెరిగిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు.. 25-30 శాతం పెరిగిన బీమా ప్రీమియంలు..!
Health Insurance
Follow us
Subhash Goud

|

Updated on: May 18, 2021 | 5:18 PM

Health Insurance: ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో ఆరోగ్య బీమా చేసుకునే వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కరోనా కాలంలో ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీమా పాలసీలు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. కరోనా సంక్షోభంలో ఆరోగ్య బీమా పాలసీలు చేసుకునే అంశంలో అవగాహన పెంచుకుంటున్నారు. ఈ ఆరోగ్య బీమా వల్ల ఆస్పత్రుల్లో చికిత్స పొందే సమయంలో కుటుంబ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌ చికిత్స కోసం రూ.14,561 కోట్ల విలువైన 9.9 లక్షల బీమా క్లెయిమ్‌లను దాఖలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది మే 4 నాటికి క్లెయిమ్‌ రూ.22,955 కోట్లకు పెరిగింది. అంటే కోవిడ్‌ క్లెయిమ్స్‌ కేవలం 44 రోజుల్లో రూ.8,385 కోట్లకు పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 57 శాతంగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

పెరుగుతున్న తిరస్కరణల రేటు

కాగా, ఎకనామిక్స్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం.. కరోనా సంక్షోభంలో ఆరోగ్య బీమా పాలసీలు పెరుగుతుండటంతో నిబంధనలు మరింత కఠినతరం చేశాయి. ఈ కారణంగా కొత్త దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. నిబంధనలు కఠినతరం చేయడంతో దరఖాస్తుల తిరస్కరణ రేటు మరింత పెరిగిపోయింది. అయితే పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గ్లోబరీ రీఇన్సూరెన్స్‌ కంపెనీలు జీవిత, ఆరోగ్య బీమా సంస్థలను పూచీకత్తు నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కోరాయి. రీ ఇన్సూరెన్స్‌ కంపెనీలు తమ నష్టాలను తగ్గించుకునేందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నాయి.

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం 25 నుంచి 30 శాతం పెంపు

కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి బీమా రంగంలో పలు బీమా కంపెనీలు ప్రీమియంలను 25 నుంచి 30 శాతం వరకు పెంచాయి. అయితే దేశంలో అతిపెద్ద బీమా కంపెనీ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) ప్రీమియం మాత్రం పెంచలేదు. ఇతర కంపెనీలు ప్రీమియంలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

ఆరోగ్య బీమా కంపెనీలు వారి క్లెయిమ్(Claims) అనుభవం, పూచీకత్తు సూత్రం ఆధారంగా ప్రీమియం రేట్లను పెంచుకోవడానికి అనుమతించబడతాయని బీమా అధికారులు చెబుతున్నారు. అయితే ఆసుపత్రులలో కరోనా వైరస్ చికిత్స కారణంగా క్లెయిమ్స్  సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కోవిడ్–-19తో వైద్య ద్రవ్యోల్బణం పెరగడంతో కస్టమర్ల కోసం ధరలను పెంచడం తప్ప మాకు వేరే మార్గం లేదని బీమా వర్గాలు చెబుతున్నాయి. ఇక టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పూర్తి రిస్క్‌ కవరేజీ ఉందని వివరిస్తున్నాయి. అయితే పాలసీ వ్యవధిలో పాలసీ దారుడు ఏదైనా కారణాల వల్ల మరణించినట్లయితే ఈ డబ్బు అతని నామినీకి వస్తుంది. ఈ పాలసీలో తక్కువ ప్రీమియంలో పెద్ద మొత్తంలో బీమా లభిస్తుంది.

ఇవీ చదవండి:

Income Tax: ఈ-వాలెట్, యూపీఐతో షాపింగ్ చేసినట్లయితే ట్యాక్స్‌ చెల్లించాలా..? నిబంధనలు ఏం చెబుతున్నాయి

Bank Services: బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. ఆ రోజు ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం కుదరదు.. ఆర్బీఐ కీలక ప్రకటన