Income Tax: ఈ-వాలెట్, యూపీఐతో షాపింగ్ చేసినట్లయితే ట్యాక్స్‌ చెల్లించాలా..? నిబంధనలు ఏం చెబుతున్నాయి

Income Tax: ప్రస్తుతం డిజిటల్‌ విధానం చెల్లింపులు భారీగా పెరిగిపోయాయి. కరోనా మమహ్మారికి తోడు చాలా మంది డిజిటల్‌ లావాదేవీల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ-వాలెట్లు,

Income Tax: ఈ-వాలెట్, యూపీఐతో షాపింగ్ చేసినట్లయితే ట్యాక్స్‌ చెల్లించాలా..? నిబంధనలు ఏం చెబుతున్నాయి
Income Tax
Follow us

|

Updated on: May 18, 2021 | 2:19 PM

Income Tax: ప్రస్తుతం డిజిటల్‌ విధానం చెల్లింపులు భారీగా పెరిగిపోయాయి. కరోనా మమహ్మారికి తోడు చాలా మంది డిజిటల్‌ లావాదేవీల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ-వాలెట్లు, UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేజ్‌) ద్వారా చేసే లావాదేవీల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత రెండు నెలల్లో ఈ లావాదేవీల సంఖ్య అనేక రెట్లు పెరిగినట్లు ఆర్థిక సంస్థలు వెల్లడిస్తున్నాయి. బ్యాంకు ATMల నుంచి తీసుకునే మొత్తంపై పరిమితులు, లావాదేవీల సంఖ్య తక్కువగా ఉండటం, విత్ డ్రా ఛార్జీలు.. వంటి ఇబ్బందులకు దూరంగా ఉండేందుకు డిజిటల్ పేమెంట్లకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు చాలా మంది కస్టమర్లు కోవిడ్ ప్రభావంతో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ ట్రాన్సాక్షన్లు కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. వీటిపై యూజర్లు అవగాహన పెంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

వ్యక్తుల జీతం, ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్.. వంటివన్నీ ఆదాయం కిందకే వస్తాయి. ఐటీఆర్‌లో ఇవన్నీ నమోదు చేయాలని ఆదాయపు పన్ను నిబంధనలు తెలియజేస్తున్నాయి. దీంతో పాటు UPI లేదా ఈ-వాలెట్ల ద్వారా అందుకున్న నిధుల వివరాలను కూడా నమోదు చేయాలి. ఈ విధానంలో చేసిన లావాదేవీలు, అందుకున్న నిధులపై కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ వర్తిస్తుంది.

యూపీఐ ద్వారా..

కాగా, యూపీఐ ద్వారా రియల్ టైమ్ మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ఈ సేవలను ఎప్పుడైనా వినియోగించుకునే అవకాశం ఉంది. యూపీఐ ద్వారా ఉచితంగా లావాదేవీలు జరపవచ్చు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలకు దీనిని లింక్‌ చేసుకోవచ్చు. ఫిక్సిడ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి వాటి నుంచి వచ్చే ఆదాయం మాదిరిగానే, యూపీఐ లావాదేవీలపై కూడా ఆదాయపు పన్ను వర్తిస్తుంది.

క్యాష్‌బ్యాక్‌ రివార్డులు

ఈ-వాలెట్ల ద్వారా లావాదేవీలు చేసినప్పుడు యూజర్లు కొన్నిసార్లు క్యాష్ బ్యాక్ రివార్డులు పొందే అవకాశం ఉంటుంది. వీటి కోసం కూడా ప్రజలు డిజిటల్ వాలెట్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతారు. ఇలా అందుకున్న క్యాష్ బ్యాక్ కస్టమర్ల బ్యాంకు అకౌంట్‌కు నేరుగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న మొత్తం రివార్డు రూ.50 వేల కంటే అధికంగా ఉంటే, ఈ క్యాష్ బ్యాక్‌పై ట్యాక్స్ వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 5(2)లో దీనికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.

లక్ష దాటితే ట్యాక్స్‌..

అయితే లక్ష రూపాయలు దాటిన యూపీఐ ట్రాన్సాక్షన్లపై ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌కం ట్యాక్స్ రూల్స్ 3(7) (iv) ప్రకారం, యజమానులు యూపీఐ విధానంలో ఇచ్చే గిఫ్ట్ వోచర్లు ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఉద్యోగులకు ఇచ్చే వోచర్లు రూ.5 వేలకు మించి ఉన్న సమయాలలో ట్యాక్స్ వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి అందుకున్న మొత్తం వోచర్ల విలువ రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే ట్యాక్స్ కట్టాల్సిందే. ఇది ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం కిందకు వస్తుంది.

UPI ట్రాన్సాక్షన్లు ఎలక్ట్రానిక్ విధానంలో జరుగుతాయి. ఆదాయపు పన్ను డిపార్ట్‌మెంట్‌ ఎప్పుడైనా ఇలాంటి ట్రాన్సాక్షన్లను ట్రేస్ చేయవచ్చు. అధికారులు ట్యాక్స్ చెల్లింపుల్లో లోపాలను గుర్తిస్తే పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల ఈ-వాలెట్లు, UPI పేమెంట్ల విషయంలో ఎలాంటి సందర్భాల్లో ట్యాక్స్ వర్తింస్తుందో తెలుసుకోవాలి. పెద్ద మొత్తంలో డిజిటల్ పేమెంట్లు చేసేవారు నిపుణుల సలహాతో ఐటీఆర్ దాఖలు చేయాలి.

ఇవీ చదవండి:

రైతులకు బంపర్‌ ఆఫర్‌.. ఈ ట్రాక్టర్ కొనుగోలు చేసిన వారికి లక్ష రూపాయల ఇన్సూరెన్స్‌ పాలసీ.. లోన్‌ సౌకర్యం

Bank Services: బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. ఆ రోజు ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం కుదరదు.. ఆర్బీఐ కీలక ప్రకటన

LPG Cylinder: గ్యాస్‌ కస్టమర్లకు అలర్ట్‌: సీలు చూసి మోసపోవద్దు.. ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే నష్టపోయినట్లే..!