ఎలాన్ మస్క్ ఆస్తులు కరిగిపోతున్నాయి.. ప్రపంచ కుబేరుల జాబితా నుంచి జారీపోతున్నాడు..ఎందుకో తెలుసా…?
Elon musk dips: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంపద తరిగిపోతోందా...? ఈ ఏడాది ఇప్పటి వరకు ఆయన సంపద 9.1 బిలియన్ డాలర్లు ఆవిరైందా..? బ్లూంబెర్గ్ అదే చెబుతోంది. తాజాగా విడుదల చేసిన జాబితాలో రెండో స్థానాన్ని కూడా..
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంపద తరిగిపోతోందా…? ఈ ఏడాది ఇప్పటి వరకు ఆయన సంపద 9.1 బిలియన్ డాలర్లు ఆవిరైందా..? బ్లూంబెర్గ్ అదే చెబుతోంది. తాజాగా బ్లూంబెర్గ్ విడుదల చేసిన జాబితాలో రెండో స్థానాన్ని కూడా కోల్పోయాడు. గత ఏడాది అనూహ్య రీతిలో సంపదను పెంచుకుని ప్రపంచ కుబేరుల్లో ఏకంగా అగ్ర స్థానాన్ని అందుకున్న ఎలాన్ మస్క్.. మార్చిలో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇప్పుడు తాజాగా విడుదలైన జాబితాలో మరో స్థానంను కూడా కోల్పాయాడు. టెస్లా షేర్లు తాజాగా 2.2 శాతం క్షీణించడం వల్ల ఇలా జరిగిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం మస్క్ సంపద 160.6 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9.1 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయాడు.
ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ గూడ్స్ సంస్థ ‘ఎల్వీఎంహెచ్’ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 161.2 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ ధనవంతుల్లో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద ఈ ఏడాది 47 బిలియన్ డాలర్లు పెరిగింది . ఇక అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుల్లో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
కర్ణుడి చావుకు చాలా కారణాలు.. అన్నట్లు మస్క్ ఆస్తులు తరిగిపోవడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో బిట్‌కాయిన్ విలువ ఇటీవల రికార్డు స్థాయిలో తగ్గటం. ఎందుకంటే బిట్‌కాయిన్‌లో మస్క్ ఈ ఏడాది ప్రారంభంలో భారీ పెట్టుబడులు పెట్టారు. ఇది కూడా ఓ కారణం ఇవే కాకుండా మరికొన్ని కారణాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: AP Budget : కరోనా కష్టకాలంలో ఏపీ సర్కారుకు కత్తి మీద సాములా మారిన పద్దుల రూపకల్పన.. మిగిలిన 9 నెలల కాలానికి ఎల్లుండి అసెంబ్లీలో బడ్జెట్