Reliance Jio: మరో సంచలనానికి తెర లేపనున్న రిలయన్స్‌ జియో.. కేబుల్‌ వ్యవస్థలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం

Reliance Jio: భారతదేశంలో ప్రముఖ 4జీ, మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ డిజిటల్‌ సర్వీస్ ప్రొవైడర్‌ రిలయన్స్‌ జియో ఇన్పోకామ్‌ లిమిటెడ్‌ అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర్గామి కేబుల్‌..

Reliance Jio: మరో సంచలనానికి తెర లేపనున్న రిలయన్స్‌ జియో.. కేబుల్‌ వ్యవస్థలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం
Reliance Jio
Follow us

|

Updated on: May 18, 2021 | 2:57 PM

Reliance Jio: భారతదేశంలో ప్రముఖ 4జీ, మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ డిజిటల్‌ సర్వీస్ ప్రొవైడర్‌ రిలయన్స్‌ జియో ఇన్పోకామ్‌ లిమిటెడ్‌ అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర్గామి కేబుల్‌ వ్యవస్థను నిర్మిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ భాగస్వాములు, సబ్‌మెరైన్‌ కెబుల్‌ సరఫరా సంస్థ సబ్‌కామ్‌ భాగస్వామ్యంతో సముద్రంలో భారత్‌ అంతటా విస్తరించేలా సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థను నిర్మిస్తున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది.

రోజురోజుకు పెరుగుతున్న డేటా డిమాండును తట్టుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ కేబుల్‌ వ్యవస్థ సింగపూర్‌, థాయ్‌లాండ్‌, మలేసియా, ఇటలీ, మధ్య, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల మీదుగా ఆసియా పసిఫిక్‌ మార్కెట్లతో భారత్‌కు అనుసంధానించబడటం, 2023 ద్వితీయార్ధం నాటికల్లా భారత్‌-ఆసియా ఎక్స్‌ప్రెస్‌ (ఐఏఎక్స్‌) సిస్టమ్‌ అందుబాటులోకి వస్తుందని రిలయన్స్‌ జియో పేర్కొంది.

టెలికాం రంగంలో సంచనాలకు వేదికైన రిలయన్స్‌ జియో దీని ద్వారా మరో ఘనతను సాధించబోతోంది. పెరుగుతున్న డేటా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలో భారీ స్థాయిలో సబ్‌మెరైన్‌ కేబుల్‌ సిస్టమ్‌ ప్రాజెక్టులకు కంపెనీ శ్రీకారం చుట్టింది. సముద్ర మార్గం ద్వారా అత్యాధునిక కేబుల్స్‌తో ఇండియా ఆసియా ఎక్స్‌ప్రెస్, ఇండియా యూరప్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ఈ ప్రాజెక్టులను అమలు చేయనుంది. ముంబై, చెన్నై కేంద్రంగా 16,000 కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌ను వేయనున్నారు. సెకనుకు 200 టెరాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌ సామర్థ్యం ఉంటుంది. భారత్‌తో తూర్పున సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా.. పశ్చిమాన ఈజిప్ట్, జిబూటీ, సౌదీ అరేబియాతోపాటు ఇటలీని కనెక్ట్‌ చేస్తారు.

రెండు ప్రాజెక్టులు ఒకదానితో ఒకటి అనుసంధానమై, అంతర్జాతీయ డేటా ఇంటర్‌ఇంటర్ ఎక్స్ ఛేంజ్ పాయింట్లను కలుపుతారు. భారత్‌తో పాటు, వెలుపల కూడా వినియోగదార్లు, కంపెనీలకు కంటెంట్, క్లౌడ్‌ సేవల విషయంలో సామర్థ్యం పెంచేందుకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో మేలు చేస్తాయని జియో పేర్కొంది. ఫైబర్‌ ఆప్టిక్‌ సబ్‌మెరైన్‌ టెలికమ్యూనికేషన్ల చరిత్రలో మొదటిసారిగా ఈ వ్యవస్థలు భారతదేశాన్ని అంతర్జాతీయ నెట్‌వర్క్‌ పటంలో ఉంచుతాయి. భారత్‌లో డిజిటల్‌ సేవలు, డేటా వినియోగం వృద్ధిలో జియో ముందుంది. భారత్‌ కేంద్రంగా తొలిసారి సబ్‌మెరైన్‌ కేబుల్‌ సిస్టమ్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో నాయకత్వ పాత్రను పోషిస్తున్నాం.. అని రిలయన్స్‌ జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్‌ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

Income Tax: ఈ-వాలెట్, యూపీఐతో షాపింగ్ చేసినట్లయితే ట్యాక్స్‌ చెల్లించాలా..? నిబంధనలు ఏం చెబుతున్నాయి

రైతులకు బంపర్‌ ఆఫర్‌.. ఈ ట్రాక్టర్ కొనుగోలు చేసిన వారికి లక్ష రూపాయల ఇన్సూరెన్స్‌ పాలసీ.. లోన్‌ సౌకర్యం

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..