ఈ ఏడాది జూలై 31 వరకు వారంటీ, వెహికల్ సర్వీస్ పొడిగింపు అందుబాటులో ఉంటుంది. హోండా టూవీలర్ కస్టమర్లకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. అయితే ఏప్రిల్ 1 నుంచి మే 31 మధ్యలో వారంటీ, ఉచిత సర్వీస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ అయిపోయే హోండా టూవీలర్లకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. హోండా మాత్రమే కాకుండా ఇప్పటికే చాలా కంపెనీలు వారంటీ పొడిగింపు నిర్ణయాన్ని వెల్లడించాయి.