Ravi Kiran |
Updated on: May 18, 2021 | 6:16 PM
దేశంలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య తలెత్తింది. కరోనా వలన ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి.. పట్టణం నుంచి పల్లె బాట పట్టారు. ఈ నేపధ్యంలోనే మీరు గ్రామాల్లో ఉంటూ ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ అధిక డబ్బు సంపాదించవచ్చు. వీటివలన డబ్బు సంపాదించడమే కాకుండా.. మీ గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించవచ్చు.
1. పాల వ్యాపారం.. మీకు ఆవులు, గేదెలు ఉన్నట్లయితే.. మీరు పాల వ్యాపారం మొదలుపెట్టడం ఉత్తమం. పాల వ్యాపారం చేయడం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు.
2. బల్క్ మిల్క్ కూలర్(BMC) ప్రారంభించవచ్చు.. ఈ వ్యాపారం స్టార్ చేసేందుకు మీరు మీ స్థలంలో మొక్కలను పెంచడం, పశువులను పెంచాలి. ఎక్కువ మోతాదులో పాల సేకరణ చేయడం.. అవి పాడవకుండా యాంత్రాల ద్వారా దాచడం చేయవచ్చు. అలాగే వాటిని నగరాల్లో వీటిని విక్రయించవచ్చు. ఇందుకోసం మీరు ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయవచ్చు. దీనికి ప్రభుత్వం కూడా సహయం అందిస్తుంది
3. విత్తనాలు, ఎరువుల దుకాణం… ఇది గ్రామాల్లో ఎక్కువగా ఉపయోగపడే వ్యాపారం. రైతులకు విత్తనాలు, ఎరువుల పట్ల అవగాహన కల్పిస్తూ.. ఆధునాతన పద్ధతుల వస్తువులను తీసుకోవడం వలన ఈ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు.
4. మెడికల్ స్టోర్.. ఈ వ్యాపారం గ్రామాల్లో అతి ముఖ్యం. మీకు ఈ వ్యాపారంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అలాగే ఎక్కువగా అవసరమయ్యే మందులను విక్రయించడం ద్వారా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయవచ్చు.
5. నేల ఆరోగ్య కార్డుతో ల్యాబ్ ప్రారంభించడం.. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా గ్రామ స్థాయిలో మినీ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది పొలంలోని నేలను పరీక్షిస్తుంది. దీని ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. మట్టి నమూనాను తీసుకోవడానికి, పరీక్షించడానికి నేల ఆరోగ్య కార్డును అందించడానికి ప్రభుత్వం ఒక నమానాకు రూ.300 ఇస్తోంది.