కరోనా కష్టాల్లో కేంద్రం గుడ్న్యూస్.. అకౌంట్లోకి ఉచితంగా రూ.50 వేలు.. సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే చాలు..
దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దీంతో ఈ మహమ్మారి కట్టడికి రాష్ట్రాలు లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఉద్యోగులు,
దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దీంతో ఈ మహమ్మారి కట్టడికి రాష్ట్రాలు లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఇక చాలా మందిలో నైపుణ్యాలు ఉండి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయినవారు చాలా మందే ఉన్నారు. ఇక ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 50 వేల క్యాష్ రివార్డు అందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకమైన కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో గెలిస్తే రూ. 50 వేలు పొందొచ్చు. ఈ డబ్బులను ఇంట్లో ఉండి ఎటు వెళ్లకుండానే గెలుచుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందామా. One India One Ration
అయితే కేంద్రం అందిస్తోన్న రూ. 50 వేలు గెలుచుకోవడానికి ముందుగా మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. అదేంటీ అని ఆలోచిస్తున్నారా ? అదేం లేదండి.. మీరు ఒక లోగో గీయాల్సి ఉంటుంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ గురించి తెలుసుగా.. ఆ పథకం కోసం మీరు ఒక లోగో గీయాల్సి ఉంటుంది. ఇందులో మీరు విజేతగా గెలిస్తే రూ. 50 వేలు వస్తాయి. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండేవారికి ఇది మంచి అవకాశం.. ఈ కష్ట సమయంలో డబ్బులు సంపాదించాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని మై గౌ ఇండియా ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ అండ్ పబ్లి్క్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఈ కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది. ఇందుకోసం మే 31 వరకు గడువు ఉంది. తొలి విజేతకు రూ. 50 వేలతోపాటు ఒక సర్టిఫికెట్ కూడా అందిస్తారు. అలాగే మరో ముగ్గురికి కూడా సర్టిఫికెట్స్ లభిస్తాయి.
మీరు మై గౌ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ కాంటెస్ట్ లో ఎవరైనా సరే పాల్గొనవచ్చు. ఒక్కొక్కరికి మూడు ఎంట్రీస్ ఉంటాయి. లోగో ఫార్మాట్ చాలా క్లియర్ గా ఉండాలి. అలాగే లోగో గురించి 100 పదాలతో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ట్వీట్.
Put on your creative cap! Design a logo for the One Nation One Ration Card plan and stand a chance to win a cash prize of Rs.50,000. Visit: https://t.co/puosLH2Bqx today! @fooddeptgoi @UNWFP_India pic.twitter.com/RFbk0pW1ge
— MyGovIndia (@mygovindia) April 29, 2021
Also Read: SBI కస్టమర్లకు గుడ్న్యూస్.. ఇక నుంచి ఆన్లైన్లోనే మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు… ఎలాగంటే..