SBI కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఆన్లైన్లోనే మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు… ఎలాగంటే..
State Bank Of India: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా ? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ
State Bank Of India: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా ? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ పనివేళలు కూడా తగ్గించబడ్డాయి. ఇక చిన్న చిన్న మార్పులకు కూడా బ్యాంకుల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎస్బీఐ కొన్ని కొత్త రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో మీరు బ్యాంకుల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడకుండా.. ఇంట్లో ఉండే ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. అవెంటో తెలుసుకుందామా.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కొత్త సర్వీసులు ఎంటంటే.. ఇక నుంచి ఇంట్లో ఉండే మీరు మొబైల్ నెంబర్ కూడా అప్ డేట్ చేసుకోవచ్చు. అది కూడా నిమిషాల్లో మీ పని పూర్తి చేసుకోవచ్చు. దీంతో మీరు బ్యాంక్ బ్రాంచుకు వెళ్లాల్సిన పనిలేదు. మీ వద్ద ఏటీఎం కార్డు ఉంటే సరిపోతుంది. అలాగే మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. ఎస్బీఐ కస్టమర్లకు మూడు ఆప్షన్లలో వారి మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. అయితే మీ మొబైల్ నంబర్ ఎలా మార్చుకోవాలి అనే సందేహం రావోచ్చు. ఎలాగంటే. ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయ్యి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం మీరు ప్రొఫైల్ ట్యాబ్ లోకి వెళ్లి పర్సనల్ డీటైల్స్ లోకి వెళ్లాలి. ఇక్కడ ప్రొఫైల్ పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్ కనిపిస్తాయి. చేంజ్ మొబైల్ నంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి. పాత మొబైల్ నంబరుకు, కొత్త మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే సరిపోతుంది. మొబైల్ నెంబర్ అప్ డేట్ అవుతుంది. తర్వాత మీకు కన్ఫర్మేష్ మేసేజ్ వస్తుంది.
ట్విట్..
Update your registered mobile number in your bank profile without visiting the branch. Use Online SBI and bank safe.
Know More: https://t.co/wwyiCoM5tE#SBIAapkeSaath #StayStrongIndia #OnlineSBI #BankSafe pic.twitter.com/etyInUO5C7
— State Bank of India (@TheOfficialSBI) May 14, 2021