గ్రామాల్లో ఈ వ్యాపారాలు చేస్తే మీరే లక్షాధికారులు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం.. ఏఏ బిజినెస్ చేయాలంటే..

గతేడాది నుంచి దేశంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా పెరిగిపోయింది. కరోనా వలన ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి.. పట్టణం నుంచి పల్లె బాట పట్టారు.

గ్రామాల్లో ఈ వ్యాపారాలు చేస్తే మీరే లక్షాధికారులు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం.. ఏఏ బిజినెస్ చేయాలంటే..
Village Business Ideas
Follow us
Rajitha Chanti

|

Updated on: May 17, 2021 | 11:35 PM

గతేడాది నుంచి దేశంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా పెరిగిపోయింది. కరోనా వలన ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి.. పట్టణం నుంచి పల్లె బాట పట్టారు. ఇక గ్రామాల్లో తక్కువ పనులు.. చేసిన పనికి తగిన డబ్బులు రాకపోవడంతో ఆర్థిక సమస్యలు ఇంక అధికమవుతున్నాయి. అయితే ప్రస్తుతం సమయంలో మీరు గ్రామాల్లో ఉంటే ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ అధిక డబ్బు సంపాదించవచ్చు. వీటివలన డబ్బు సంపాదించడమే కాకుండా.. మీ గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించవచ్చు. ఈ వ్యాపారాలు చేయడం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని రాబట్టవచ్చు. అవి ఎంటో తెలుసుకుందామా.

1. పాల వ్యాపారం.. మీకు ఆవు, గేదెలు కనుక కలిగి ఉంటే మీరు పాల వ్యాపారం చేయడం ఉత్తమం. పాల వ్యాపారం చేయడం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. ప్రస్తుత ఆధునాతన పద్ధతులను ఉపయోగిస్తూ ఈ వ్యాపారం చేయడం వలన సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు.

2. BMC ప్రారంభించడం.. BMC అంటే బల్క్ మిల్క్ కూలర్ అని అర్థం. ఇందు కోసం మీ స్థలంలో మొక్కలను పెంచడం, పశువులను పెంచడం ద్వారా ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఎక్కువ మోతాదులో పాల సేకరణ చేయడం.. అవి పాడవకుండా యాంత్రాల ద్వారా దాచడం చేయవచ్చు. అలాగే వాటిని నగరాల్లో వీటిని విక్రయించవచ్చు. ఇందుకోసం మీరు ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం కూడా సహయం అందిస్తుంది.

3. విత్తనాలు, ఎరువుల దుకాణం… ఇది గ్రామాల్లో ఎక్కువగా ఉపయోగపడే వ్యాపారం. రైతులకు విత్తనాలు, ఎరువుల పట్ల అవగాహన కల్పిస్తూ.. ఆధునాతన పద్ధతుల వస్తువులను తీసుకోవడం వలన ఈ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు.

4. మెడికల్ స్టోర్.. ఇక ప్రస్తుత పరిస్థితులలో ఈ వ్యాపారం గ్రామాల్లో అతి ముఖ్యం. ఇందుకోసం ముఖ్యంగా మీరు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అలాగే ఎక్కువగా అవసరమయ్యే మందులను విక్రయించడం ద్వారా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయవచ్చు.

5. నేల ఆరోగ్య కార్డుతో ల్యాబ్ ప్రారంభించడం.. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా గ్రామ స్థాయిలో మినీ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది పొలంలోని నేలను పరీక్షిస్తుంది. దీని ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి ప్రయోగ శాలలు చాలా తక్కువగా ఉన్నాయి. పొలంలో మట్టిని ప్రయోగశాలలో పరిశీలించి.. అందులో లభించే పోషకాలను నిర్ధారించాలి. మట్టి నమూనాను తీసుకోవడానికి, పరీక్షించడానికి నేల ఆరోగ్య కార్డును అందించడానికి ప్రభుత్వం ఒక నమానాకు రూ.300 ఇస్తోంది.

Also Read: పసుపు పాలతో తాగితే బరువు తగ్గుతారా ? వెయిట్ లాస్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?