పసుపు పాలతో తాగితే బరువు తగ్గుతారా ? వెయిట్ లాస్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే..

కరోనా రాకుండా ఉండేందుకు ఇప్పుడు చాలా మంది రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం కోసం వెతుకుతున్నారు. ఇక కరోనా మహమ్మారి వలన ఏర్పడిన లాక్ డౌన్ సమయంలో

పసుపు పాలతో తాగితే బరువు తగ్గుతారా ? వెయిట్ లాస్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే..
Immunity
Rajitha Chanti

|

May 17, 2021 | 5:35 PM

కరోనా రాకుండా ఉండేందుకు ఇప్పుడు చాలా మంది రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం కోసం వెతుకుతున్నారు. ఇక కరోనా మహమ్మారి వలన ఏర్పడిన లాక్ డౌన్ సమయంలో ప్రజలు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గించడానికి ఆహారం తీసుకోవడం మానేస్తున్నారు. దీంతో వెయిట్ లాస్ అవ్వడం కాదు కదా.. మరిన్ని అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇంకేముందు కరోనా కంటే ముందుగా వారి శరీరాల్లోకి అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చి చేరుతున్నా్యి. ఇక ఈ అధిక బరువు సమస్య ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగులలో వస్తుంది. అందుకే వీరు బరువు తగ్గడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అవి ఎంటో తెలుసుకుందామా.

3

కొబ్బరి నూనె.. ఇది అధిక బరువును నియంత్రించడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తోంది. మీరు తీసుకునే సలాడ్ గిన్నెలో రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెను జతచేయాలి. అలాగే ఈ కొబ్బరి నూనెను వంట చేసేప్పుడు ఉపయోగించవచ్చు. రోజుకు రెండు స్పూన్స్ తీసుకోవడం వలన ఫలితం కనిపిస్తుంది.

1

వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది యాంటీమైక్రోబయల్ ఏజెంట్. దీనిని ఎక్కువగా పచ్చడిలో, కూరలలో చేర్చి తీసుకోవాలి. యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలను కలిగి ఉండడం వలన బరువు నియంత్రణలో ఉంచడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

2.

ఆపిల్ సైడ్ వెనిగర్ శరీరంలో వేడిని తగ్గించడానికి సహయపడుతుంది. అలాగే ఇది క్లోరోజెనిక్ ఆమ్లం కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది యాంటీ ఆక్సిడెంట్. ఇది విసెరల్ కొవ్వును తగ్గించటానికి సహాయపడుతుంది. 1-2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ భోజనానికి ముందు తీసుకున్నప్పుడు నీటిలో కరిగి జీవక్రియ సిండ్రోమ్‌ను నివారించడంలో సహాయపడుతుంది. దీంతో ఉబకాయం తగ్గుతుంది అలాగే బరువును నియంత్రిస్తుంది.

4

దాల్చిన చెక్క.. మన వంటశాలలో ఉండే అత్యంత ముఖ్యమైన ఆహార పదార్థం. దీనిని ఫ్రూట్స్, మిల్క్ షేక్స్, గ్రీన్ టీ పై పూతగా ఉపయోగించవచ్చు. దాల్చిన చెక్క పొడిని సగం టీ స్పూన్ రోజూ తీసుకోవడం వలన బరువు తగ్గించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

6

పసుపు.. ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. దీనిని ఎక్కువగా కూరలలో ఉపయోగిస్తుంటాం. దీనిని పాలలో కలిపి తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. బరువు నియంత్రిస్తుంది.

Also Read: PF ఖాతాదారులకు శుభవార్త.. ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రతి నెల అకౌంట్‏లోకి డబ్బులు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu