గుడ్‏న్యూస్ చెప్పిన కేంద్రం.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. జీఎస్‏టీ చెల్లించే వారికి బెనిఫిట్..

కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో మరోసారి ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇక ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ విధానం వలన ఎంతో వ్యాపారులు

గుడ్‏న్యూస్ చెప్పిన కేంద్రం.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. జీఎస్‏టీ చెల్లించే వారికి బెనిఫిట్..
Gst
Follow us
Rajitha Chanti

|

Updated on: May 17, 2021 | 11:13 PM

కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో మరోసారి ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇక ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ విధానం వలన ఎంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు శుభవార్త అందించింది. వీరి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సె్స్ అండ్ కస్టమ్స్ సీబీఐసీ ట్యాక్స్ రిఫంట్ డ్రైవ్ ను ప్రారంభించింది. దీంతో చాలా మంది బెనిఫిట్ కలగనుంది. అలాగే వ్యాపారులు లిక్విడిటీ సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక లాక్ డౌన్ వలన సమస్యలు ఎదుర్కోంటున్న వ్యాపారులకు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఊరట కలగనుంది. GST Refund

మే 15 నుంచి 31 వరకు ప్రత్యేకమైన జీఎస్టీ రిఫండ్ చెల్లింపు డ్రైవ్ నిర్వహించాలని సీబీఐసీ ఇప్పటికే ఫీల్డ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పెండింగ్‏లో ఉన్న జీఎస్టీ రిఫండ్ చెల్లింపులు వెంటనే పూర్తి కానున్నాయి. దీంతో వ్యాపారులకు జీఎస్టీ రిఫండ్ వెంటనే క్రెడిట్ అవుతుంది. మే 14 వరకు పెండింగ్‏లో ఉన్న జీఎస్టీ రిఫండ్ క్లెయిమ్స్ అన్ని మే 31లోపు సెటిల్ కానున్నాయి. ఇదిలా ఉంటే జీఎస్‌టీ చట్టం ప్రకారం రిఫండ్ సెటిల్‌మెంట్‌కు 60 రోజుల దాకా గడువు ఉంటంది. Tax Refund అయితే జీఎస్‌టీ రిఫండ్ క్లెయిమ్ అప్లికేషన్ వచ్చి 30 రోజుల్లోనే సెటిల్‌మెంట్ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం అధికారులు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ల్యాప్‏టాప్‏లలో ఎక్కువగా వర్క్ చేస్తున్నారా ? ఆరోగ్యానికి మరింత రిస్క్.. హెచ్చరిస్తున్న నిపుణులు..

పండ్లు, కూరగాయలు తినడం వలన ఒత్తిడి ఫసక్… అధ్యయనాల్లో వెలువడిన సంచలన విషయాలు..

పసుపు పాలతో తాగితే బరువు తగ్గుతారా ? వెయిట్ లాస్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే..

WHO Report: ఎక్కువ గంటలు పని చేస్తే గుండెపోటు.. పదేళ్లలో పెరిగిన మరణాలు.. బాధితుల్లో పురుషులే అధికంః డబ్ల్యూహెచ్‌వో