AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ల్యాప్‏టాప్‏లలో ఎక్కువగా వర్క్ చేస్తున్నారా ? ఆరోగ్యానికి మరింత రిస్క్.. హెచ్చరిస్తున్న నిపుణులు..

కరోనా కారణంగా గతేడాది నుంచి వర్క్ ఫ్రమ్ హోం విధానం అమలులోకి వచ్చింది. గత సంవత్సరం నుంచి దాదాపు అన్ని కంపెనీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

ల్యాప్‏టాప్‏లలో ఎక్కువగా వర్క్ చేస్తున్నారా ? ఆరోగ్యానికి మరింత రిస్క్.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Health Tips
Rajitha Chanti
|

Updated on: May 17, 2021 | 10:06 PM

Share

కరోనా కారణంగా గతేడాది నుంచి వర్క్ ఫ్రమ్ హోం విధానం అమలులోకి వచ్చింది. గత సంవత్సరం నుంచి దాదాపు అన్ని కంపెనీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇక మొదట్లో ఇబ్బంది పడిన ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ అలవాటుగా మారిపోయింది. అయితే క్రమంగా ఈ పని వలన చాలా మందిలో ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. వెన్నునొప్పి, ఉబకాయం, అధిక బరువు పెరుగుదల వంటి సమస్యలను ఎదుర్కోంటున్నారు. ఇవే కాకుండా.. ఎక్కువ సేపు ల్యాప్‏టాప్‏లలో పనిచేసే వారిలో మరిన్ని సమస్యలను గుర్తించారు నిపుణులు. ఎక్కువగా ల్యాప్‏టాప్‏లలో వర్క్ చేస్తే ఆరోగ్యానికి మరింత రిస్క్ అంటున్నారు.

ఎక్కువ సేపు ల్యాప్‏టాప్‏లలో వర్క్ చేసే వారిలో కండరాలు, ఎముకల్లో లోపాలను డాక్టర్లు గుర్తించారు. ఈ సమస్యలు రోజుకీ 8 నుంచి 9 గంటలు పనిచేసే వారిలో గుర్తించారు. కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ఒక రుగ్మత, దీనిని మీడియన్ నరాల కుదింపు అని కూడా పిలుస్తారు. దీని వలన తిమ్మిరి, బలహీనత, చేతులలో వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. నరాలపై ఒత్తిడి ఎక్కువవుతుంది. అలాంటి సమయంలో కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ సంభవిస్తుంది. ఇది మీ చేయి పొడవు గుండా నడిచే నాడి, మణికట్టు మీద గుండా వెళుతుంది మరియు మీ చేతిలో ముగుస్తుంది. ఈ నాడి మీ బొటనవేలు యొక్క కదలికను, అనుభూతులను నియంత్రిస్తుంది. చిటికిన వేలు మినహా మీ అన్ని వేళ్లు ఇందుకు ప్రభావితం అవుతాయి.

వర్క్ ఫ్రమ్ హోం విధానం.. నిరంతరం ఒకే భంగిమలో కూర్చోవడం.. ఎక్కువగా స్క్రీన్ చూడడం వలన ఎముకలు, కండరాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ల్యాప్ టాప్ లలో ఎక్కువగా వర్క్ చేయడం, భంగిమలో మార్పులవలన కండరాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ సమస్య కొంతమందిలో ఇతరుల కన్నా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. నేషలన్ ఉమెన్స్ హెల్త్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రకారం కార్బల్ టన్నెల్ సిండ్రోమ్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవి.. మణికట్టు, చేతుల మధ్య ఉండే ఎముకలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటి మధ్య ఎప్పుడూ కదలికలు జరుగుతుంటాయి. ఇవే కాకుండా.. గర్భం దాల్చకపోవడం.. పీరియడ్స్ సమస్య, మాస్టెక్టమీ కలిగి ఉండడం, ఉబకాయం వంటి సమస్యలు వచ్చే ప్రమాధం ఉంది.

కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ యొక్క కొన్ని సాధారణ లక్షణాలు… 1. కాళ్లు చేతులలో మంటలు రావడం. తిమ్మిర్లు, జలదరింపు లేదా బొటనవేలు మధ్య నొప్పి రావడం. 2. మోచేతి వరకు జలదరింపు ఉండడం. 3. వేళ్ళ వాపు.. 4. బొటనవేలు, వేళ్ళలో షాక్ గా అనిపించడం. 5. పిడికిలి పట్టేయడం. ఇలాంటి లక్షణాలు కనుక మీరు అనుభవించినట్లుతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.