కోవిడ్ వ్యాక్సినేషన్ టైంలో వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి.. లేదంటే చాలా డేంజర్..!

Covid Vaccination: కరోనా మహమ్మారిని కట్టడికి వ్యాక్సినేషన్ సరైన మార్గం. అందుకే ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని....

కోవిడ్ వ్యాక్సినేషన్ టైంలో వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి.. లేదంటే చాలా డేంజర్..!
Covi Vaccination
Follow us
Ravi Kiran

|

Updated on: May 18, 2021 | 4:28 PM

Covid Vaccination: కరోనా మహమ్మారిని కట్టడికి వ్యాక్సినేషన్ సరైన మార్గం. అందుకే ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇక మొదట్లో వ్యాక్సిన్‌పై ప్రజల్లో పలు సందేహాలు, అపోహలు ఉన్నా.. ఆ తర్వాత అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడంతో జనాలు టీకా కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అయితే కొంతమందిలో మాత్రం ఇంకా వ్యాక్సిన్‌పై అపోహలు తొలగలేదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. రెండు రోజుల పాటు కొంతమందిలో జ్వ‌రం, త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు లాంటి దుష్ప్రభావాలు కనిపించడమే అందుకు కారణం.

అయితే వ్యాక్సినేష‌న్‌కు ముందు, ఆ త‌ర్వాత శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే వ్యాక్సినేషన్ టైంలో వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…

టీకా వేయించుకునే కొన్ని రోజుల ముందు పసుపు, వెల్లుల్లి, అల్లం, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలని.. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బ్లూ బెర్రీస్, చికెన్/వెజిటబుల్ సూప్, డార్క్ చాక్లెట్, ఆలివ్ నూనె, బ్రకోలిని డైట్‌ ప్లాన్‌లో ఉండేలా చూసుకోవాలన్నారు. కాగా, ధూమపానం, మద్యపానం, ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ వేయించుకోవడం, కెఫిన్‌ ఉన్న డ్రింక్స్ తీసుకోవడం లాంటివి వ్యాక్సినేషన్ సమయంలో అస్సలు చేయకూడదని హెచ్చరించారు.

టీకా కోసం ఎక్కడ నమోదు చేయాలి…

18 ఏళ్లు పైబడిన వారు టీకా కోసం కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు లేదా ఉమాంగ్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా, ప్రైవేట్ టీకా కేంద్రాలలో కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో, మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ టీకా కేంద్రాలను ఎన్నుకునే అవకాశాన్ని పొందుతారు. ఇక వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ,పాన్ కార్డు, పాస్‌పోర్ట్, పెన్షన్ పాస్‌బుక్, NPR స్మార్ట్ కార్డ్, ఓటరు ఐడీ వంటి వాటిల్లో ఏదైనా ఐడీ ప్రూఫ్‌లు సమర్పించవచ్చు.

Also Read:

 ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

అద్భుతమైన పోస్టాఫీస్ స్కీ‌మ్.. ప్రతీ నెలా రూ. 5042 కడితే.. రూ. 7.25 లక్షలు పొందొచ్చు..