సీనియర్ నటి పావలా శ్యామలకు చిరంజీవి ఆర్థిక సాయం.. ‘మా’ అసోసియేషన్ మెంబర్ షిప్ కార్డు.. ప్రతి నెల ఫించన్..

Pavala Shyamala: టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామాల తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసింది. శ్యామల పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

సీనియర్ నటి పావలా శ్యామలకు చిరంజీవి ఆర్థిక సాయం.. ‘మా’ అసోసియేషన్ మెంబర్ షిప్ కార్డు.. ప్రతి నెల ఫించన్..
Pavala Shyamala

Pavala Shyamala: టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామాల తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసింది. శ్యామల పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వెంటనే ఆమెకు ‘మా’ అసోసియేషన్ సభ్యత్వంతోపాటు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ సభ్యులు కరాటే కళ్యాణి, సురేష్ కొండేటి శ్యామల ఇంటికి వెళ్ళి ‘మా’ అసోసియేషన్ కార్డు సహా రూ. 1,01,500 అందించారు. అలాగే ‘మా’ మెంబర్ షిప్ కార్డుతో నెలకు రూ. 6 వేల చొప్పున ఫించను వస్తుందని తెలిపారు. ‘మా’ సభ్యత్వం పొంది ఉంటే ఎవ‌రైనా ఆర్టిస్ట్ అకాల‌ మ‌ర‌ణం చెందితే వారికి రూ.3 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. పావలా శ్యామల కూతురి వైద్యానికి సంబంధించి న్యూరో సిటీ సెంటర్ వైద్య నిపుణులు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. megastar chiranjeevi

ఇక ఈ విషయంపై పావలా శ్యామల మాట్లాడుతూ.. “గతంలో నేను ఆర్థిక సమస్యలతో ఉన్నప్పుడు ఎవరూ సాయం చేయలేదు.. కానీ మెగాస్టార్ చిరంజీవి కుమార్తె వచ్చి రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈ కష్టంలో ఉన్న నాకు మరోసారి రూ. లక్షా పదిహేను వందల రూపాయలను చెక్ రూపంలో అందించారు. అంతేకాకుండా ప్రతి నెలా ఆరువేల రూపాయలు సాయం అందించేందుకు సాయ‌ప‌డ్డారు. మ‌న‌స్ఫూర్తిగా చిరంజీవి గారికి నా ధ‌న్యవాదాలు” అని అన్నారు.ఈ క‌ష్టకాలంలో ఆపద్బాంధవుడిలా పావ‌లా శ్యామ‌ల‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చి ‘మా’ కార్డు ఇప్పించడమే కాకుండా.. ఆర్థిక సహాయం చేసినందుకు కమిటీ సభ్యులు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 250కు పైగా చిత్రాల్లో నటించిన శ్యామల.. ఇప్పుడు వయసు మీదపడటంతో పాటు అవకాశాలు కూడా లేక పోవడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కుమార్తె అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక సమస్యలతో పావలా శ్యామల పరిస్థితి దారుణంగా మారింది. గతంలో తాను సమస్యలలో ఉన్నప్పుడు చిరంజీవి రూ. 2 లక్షల ఆర్థిక చేయడంతోపాటు తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.10 వేల పింఛను వచ్చేదని, ఇప్పుడది రావడంలేదని పావలా శ్యామల వాపోయారు.

Also Read: స్పీడ్ పెంచిన నాగ చైతన్య… మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏కు ఓకే చెప్పిన చైతు.. త్వరలోనే సెట్స్ పైకి ?

నెటిజన్లపై మండిపడ్డ రేణు దేశాయ్.. పిచ్చి పిచ్చి మెసేజీలు ఆపండి.. మిగతవాళ్ళ ప్రాణాలు పోతున్నాయ్ అంటూ ఫైర్..