నెటిజన్లపై మండిపడ్డ రేణు దేశాయ్.. పిచ్చి పిచ్చి మెసేజీలు ఆపండి.. మిగతవాళ్ళ ప్రాణాలు పోతున్నాయ్ అంటూ ఫైర్..

Renu Desai: దేశంలోని కరోనా రెండో దశ మరణ మృదంగం చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎంతోమందిని బలి తీసుకుంటుంది ఈ వైరస్.

నెటిజన్లపై మండిపడ్డ రేణు దేశాయ్.. పిచ్చి పిచ్చి మెసేజీలు ఆపండి.. మిగతవాళ్ళ ప్రాణాలు పోతున్నాయ్ అంటూ ఫైర్..
Renu Desai
Follow us
Rajitha Chanti

|

Updated on: May 18, 2021 | 6:44 PM

Renu Desai: దేశంలోని కరోనా రెండో దశ మరణ మృదంగం చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎంతోమందిని బలి తీసుకుంటుంది ఈ వైరస్. ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్ కొరత, వెంటిలెటర్ల కొరతతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులలో పలువురు సినీ ప్రముఖులు కోవిడ్ బాధితులకు సాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే బాలీవుడ్, కోలివుడు సెలబ్రెటీలు కరోనా బాధితులకు అండగా.. తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. ఇక ఇటీవల సినీ నటి… సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్.. కరోనా బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అవసరం ఉన్నవారు తన ఇన్ట్ స్టాలో మెసేజ్ చేస్తే సాయం చేస్తా అని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి లైవ్ కి వచ్చిన రేణు దేశాయ్.. నెటిజన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక తనకు ఇన్ స్టాలో కొంతమంది సరదా మెసేజీలు పెట్టడం కారణంగా మరోకరి ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హాయ్, హాలో అంటూ మెసేజ్ లు చేయడం వలన సాయం కోరుతూ పంపిన వాళ్ల మెసేజ్ లు కిందకు వెళ్లిపోతున్నాయని.. దీంతో అవి చూడటానికి తనకు వీలు కావడం లేదని తెలిపారు. సరదా కోసం చేసే పనుల కారణంగా అవతల సరైన సమయంలో సాయం అందక కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని.. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజీలు చేయడం ఆపండి అంటూ ఫైర్ అయ్యారు. తాను ఆర్థిక సాయం చేయడంలేదని.. కానీ అనారోగ్యంతో ఉన్నావారికి ఆసుపత్రులు, మందులు, ఆక్సిజన్ విషయంలో మాత్రమే తన వంతు సాయం చేస్తున్నా అని చెప్పారు. అలాగే తన పేరుతో ట్విట్టర్ అకౌంట్ ను ఎవరు ఫాలో కావద్దని.. తనకు ట్విట్టర్ ఖాతా లేదని.. కేవలం ఇన్ స్టా మాత్రమే ఉందని తెలిపారు.

వీడియో..

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

Also Read: రూటు మార్చిన మెగా హీరో… ఈసారి స్పోర్ట్స్ డ్రామాతో రానున్న వైష్ణవ్ తేజ్.. డైరెక్టర్ ఎవరంటే..

Covid Care: కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చా ? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..