AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : తనను 7 ఏళ్లు ప్రేమించా.. చెప్పకుండా వెళ్లిపోయింది.. అందుకే.. టాలీవుడ్ నటుడు..

టాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు అమృతం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. ఆ తర్వాత సినిమాల్లో ముఖ్యపాత్రలతో అలరిస్తున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, వైవాహిక జీవితంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను ఎప్పుడూ ఒంటరిగా ఉండే వ్యక్తిని అని.. తనకు వివాహం పట్ల ఆసక్తి ఉండేదని వెల్లడించారు. ఏడేళ్ల ప్రేమ తర్వాత, తన ప్రేయసి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిందని అన్నారు.

Tollywood : తనను 7 ఏళ్లు ప్రేమించా.. చెప్పకుండా వెళ్లిపోయింది.. అందుకే.. టాలీవుడ్ నటుడు..
Harshavardhan
Rajitha Chanti
|

Updated on: Jan 29, 2026 | 9:36 PM

Share

హర్షవర్ధన్ మాట్లాడుతూ.. రవీంద్రభారతిలో తన మొదటి అవార్డు అందుకుంటున్న సమయంలోనే తన ప్రేయసి వివాహం చేసుకున్న వార్త తెలిసిందని అన్నారు. ముందు ఆ మాట వినగానే షాకయ్యానని అన్నారు. బాల్యం నుండి తాను ఒంటరిగా ఉన్నప్పటికీ, వివాహం పట్ల తనకెప్పుడూ ఆసక్తి ఉండేదని పేర్కొన్నారు. ఏడేళ్ల పాటు ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించిన సమయంలో, అనూహ్యంగా ఆ అమ్మాయి ఎటువంటి సమాచారం లేకుండా మరొకరిని వివాహం చేసుకుందని ఆయన తెలిపారు. మొదట ఇది ప్రేమ వైఫల్యమని భావించినప్పటికీ, కాలక్రమేణా ఆ సంఘటనే తన జీవితంలో అతి పెద్ద విజయానికి కారణమైందని ఆయన వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్‏మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..

ఆ ప్రేమ విఫలం కాలేదని, అది తనకు ఎంతో నేర్పించిందని హర్షవర్ధన్ చెప్పారు. తన వైపు నుండి ఎటువంటి సమస్య లేదని, కానీ తాను తన పనిలో నిమగ్నమై ఆమెకు తగిన సమయం ఇవ్వలేకపోవడమే కారణం కావచ్చని అన్నారు. ఆ సంఘటన జరిగిన తీరును ఆయన సినిమాటిక్ సీన్ గా తెలిపారు.. రవీంద్రభారతిలో తన మొదటి అవార్డును అందుకుంటున్న సమయంలోనే, తన మాజీ ప్రేయసి వివాహం చేసుకుందనే వార్త వేరొకరి ద్వారా తనకు తెలిసిందని గుర్తుచేసుకున్నారు. ఈ వార్త విన్నప్పుడు ఒకేసారి నవ్వుతూ, ఏడుస్తూ ఉన్నట్లు తెలిపారు. ఈ సంఘటనలన్నీ తనను మరింత బలంగా మార్చాయని, జీవితంలో ప్రతికూలతలు ఎదురైనప్పుడు, వాటిని అధిగమించడానికి ఎల్లప్పుడూ ఏదో ఒక “గోపిక” (ఆమెను ఒక ఆశాకిరణం లేదా అవకాశంగా) సహాయపడుతుందని తెలిపారు. తన మాజీ ప్రేయసి వెళ్లిపోకపోతే, తాను సినిమా రంగంలోకి వచ్చేవాడిని కాదని, బహుశా ఒక రెస్టారెంట్ యజమానిగా ఉండేవాడినని ఆయన వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

Harshavardhan (1)

Harshavardhan (1)

ఎక్కువమంది చదివినవి : Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..

ఎక్కువమంది చదివినవి : Actress Rohini: రఘువరన్‏తో విడిపోవడానికి కారణం అదే.. ఆయన ఎలా చనిపోయాడంటే.. నటి రోహిణి..