మీ పళ్లకు ఏ బ్రష్ మంచిది.. డెంటిస్ట్‌లు చెబుతున్న అసలు నిజాలు తెలిస్తే షాకే..
మనం రోజూ ఉదయాన్నే చేసే మొదటి పని పళ్లు తోముకోవడం. అయితే మీరు వాడుతున్న టూత్ బ్రష్ మీ దంతాలను శుభ్రపరుస్తోందా లేక పాడు చేస్తోందా..? చాలామంది బ్రష్ అరిగిపోయి పీచులా మారే వరకు దానిని వాడుతుంటారు. కానీ అది మీ చిగుళ్లకు ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా?

మనం రోజూ ఉదయాన్నే చేసే మొదటి పని పళ్లు తోముకోవడం. అయితే మీరు వాడుతున్న బ్రష్ సరైనదేనా? దంతాల మధ్య ఇరుక్కున్న వ్యర్థాలను అది నిజంగా తొలగిస్తోందా? అంటే చాలామంది దగ్గర సమాధానం లేదు. ఒక సాధారణ టూత్ బ్రష్ ఎంపికలో మనం చేసే చిన్న పొరపాట్లు చిగుళ్ల వ్యాధులకు, పళ్లు పుచ్చిపోవడానికి కారణమవుతున్నాయి.
బ్రిస్టల్స్ ఎలా ఉండాలి?
చాలామంది సమానంగా, గట్టిగా ఉండే బ్రిస్టల్స్ ఉన్న బ్రష్‌లను ఎంచుకుంటారు. కానీ వైద్యుల ప్రకారం.. జిగ్-జాగ్ లేదా ఉంగరాల ఆకారంలో ఉండే మృదువైన బ్రిస్టల్స్ మాత్రమే దంతాల మధ్య సందుల్లోకి వెళ్లి ఆహార కణాలను తొలగిస్తాయి. బ్రిస్టల్స్ మరీ గట్టిగా ఉంటే అవి పళ్లపై ఉండే ఎనామిల్‌ను అరిగిపోయేలా చేస్తాయి మరియు చిగుళ్ల నుండి రక్తం వచ్చేలా చేస్తాయి.
బ్రష్ ఆకారం
టూత్ బ్రష్ కొనేటప్పుడు దాని తల భాగం ఎలా ఉందో గమనించాలి. U-ఆకారపు తల ఉన్న బ్రష్ కంటే, V-ఆకారంలో ఉండే బ్రష్ నోటి మూలల్లోకి, వెనుక పళ్ల వరకు సులభంగా చేరుతుంది. బ్రష్ హ్యాండిల్ నేరుగా ఉండటం కంటే కొంచెం వంపు తిరిగి ఉంటే వెనుక దవడ పళ్లను శుభ్రం చేయడం చాలా సులభం అవుతుంది. అలాగే హ్యాండిల్ పొడవుగా ఉంటే పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది.
బ్రష్‌ను ఎప్పుడు మార్చాలి?
చాలామంది బ్రష్ బ్రిస్టల్స్ అన్నీ పక్కకు వంగిపోయే వరకు వాడుతుంటారు. కానీ పరిశోధనలు.. మీ టూత్ బ్రష్‌ను కనీసం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కచ్చితంగా మార్చాలి. అరిగిపోయిన బ్రష్‌ను వాడటం వల్ల పళ్లు సరిగ్గా శుభ్రపడకపోగా, బ్యాక్టీరియా పేరుకుపోయే ప్రమాదం ఉంది.
View this post on Instagram
