Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గొప్ప మనసు.. తల్లి అంజనమ్మ పుట్టిన రోజు సందర్భంగా ఏం చేశారో తెలుసా?
ఇతరులకు సాయం చేయడంలో అందరికన్నా ఒక మెట్టు ముందుంటారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన తల్లి అంజనా దేవి పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ గురువారం (జనవరి 29) విశాఖపట్నంలో పర్యటించారు. ఇందులో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. ఈ సందర్భంగా తల్లి అంజనా దేవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఏడాది పాటు రెండు జిరాఫీలకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని వెల్లడించారు. కాగా జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జూ పార్క్ లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్ ను పవన్ ప్రారంభించారు. అలాగే జూపార్క్ లోని నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎంక్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం, వాటి పేర్లు తదితర వివరాలు జూ క్యూరేటర్ ని అడిగి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించి వాటికి స్వయంగా ఆహారం అందించారు. ఇక కంబాలకొండ ఎకో పార్క్ లో నగర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పార్క్ లోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. మార్గం మధ్యలో మొక్కల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘మన దేశంలో వన్యప్రాణుల సంరక్షణ అంశంలో జూపార్కులు చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అంతరించిపోతున్న జీవ జాతులను రక్షిస్తున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాఖ జూపార్క్ లో వందలాది వన్యప్రాణులు, పక్షులు ఆహ్లాదకర వాతావరణం మధ్య జీవిస్తున్నాయి. వాటిని సంరక్షణ మనందరి బాధ్యత. జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లు భాగస్వాములు కావాలి. తమకు నచ్చిన జంతువును ఎంచుకొని వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. మా కుటుంబం మొత్తం జంతు ప్రేమికులం. జంతు సంక్షణపై చాలా శ్రద్ధపెడతాం’ అన్నారు.
విశాఖ ఇందిరా గాంధీ జూ పార్క్ లో పవన్ కల్యాణ్..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి @PawanKalyan విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు.
•తల్లి శ్రీమతి అంజనా దేవి గారి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఉప… pic.twitter.com/jAeWxrJz2A
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) January 29, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




