Brahmaji: “సమంతను అతను ఆ మాటలంటే పట్టరాని కోపం వచ్చింది”.. బ్రహ్మాజీ ఆసక్తికర కామెంట్స్

సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత వీరి గురించి నిత్యం ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుస్తూనే ఉంది. విడాకుల తర్వాత సమంత కొంతకాలం మోటివేషన్ కొటేషన్స్ ను షేర్ చేసింది.

Brahmaji: సమంతను అతను ఆ మాటలంటే పట్టరాని కోపం వచ్చింది.. బ్రహ్మాజీ ఆసక్తికర కామెంట్స్
Brahmaji
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 21, 2022 | 8:20 PM

సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత వీరి గురించి నిత్యం ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుస్తూనే ఉంది. విడాకుల తర్వాత సమంత కొంతకాలం మోటివేషన్ కొటేషన్స్ ను షేర్ చేసింది. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ తో విహారయాత్రల ను  ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత తిరిగి సినిమాలతో బిజీగా మారింది. అటు నాగచైతన్య కూడా తన సినిమాలు చేసుకుంటూ  వెళ్తున్నాడు. ఎక్కడ కూడా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడలేదు చై. అయితే సమంత చైతన్య దగ్గర నుంచి రూ.250 కోట్లు భరణం తీసుకుందని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తల్లో వాస్తవం లేకపోయినా నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా నటుడు బ్రహ్మాజీ(Brahmaji) ఈ విషయం గురించి ఆసక్తికర విషయం చెప్పారు. తాజాగా జరిగిన ఓ ఇంట్రవ్యూలో బ్రహ్మాజీ మాట్లాడుతూ సమంత విషయంలో ఓ నెటిజన్ కు వార్నింగ్ ఇచ్చానని అన్నారు.

తాజాగా బ్రహ్మాజీ మాట్లాడుతూ.. నేను సామాన్యంగా ఇతరుల విషయాల్లో తలదూర్చాను.. కానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడుతా అన్నారు బ్రహ్మాజీ. ఇటీవల ఒక వ్యక్తి సమంత గురించి తప్పుగా మాట్లాడాడు.. నాగచైతన్య నుంచి  సామ్ 250 కోట్లు భరణం తీసుకుని గేమ్‌ ప్లే చేశావు, నువ్వో సెకండ్‌ హ్యాండ్‌ అంటూ  నీచంగా మాట్లాడాడు. దాంతో నాకు కోపం వచ్చింది. నువ్వు  సమంతను చూడాలన్నా, ఆమెతో మాట్లాడాలన్నా దాదాపు పదేళ్లు పడుతుంది. కానీ ఈ సోషల్‌ మీడియా వల్ల కనీసం ఆమెతో మాట్లాడే అవకాశం వచ్చిందని ఆనందపడు. నీకు సిగ్గు, శరం లేదు. నువ్వు థర్డ్‌ గ్రేడ్‌. అమ్మాయి వ్యక్తిగత విషయంతో నీకేంటి సంబంధం అంటూ ఫైర్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు బ్రహ్మాజీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి