Neha Kakkar: షోలో ఏడ్చేసిన ఫేమస్ సింగర్‎ను నెట్టింట ట్రోల్ చేసిన నెటిజన్స్.. ఘాటు రిప్లై ఇచ్చిన నేహా..

ఈ క్రమంలో తనపై కామెంట్స్ చేసేవారి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అందరు ఎమోషనల్‏గా ఉండరని.. తనను ఎగతాళి చేసే వ్యక్తులను తాను ఎప్పటికీ నిందించలేనని తెలిపింది. అసలు విషయమేంటంటే..

Neha Kakkar: షోలో ఏడ్చేసిన ఫేమస్ సింగర్‎ను నెట్టింట ట్రోల్ చేసిన నెటిజన్స్.. ఘాటు రిప్లై ఇచ్చిన నేహా..
Neha Kakkar
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 21, 2022 | 2:11 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఫేమస్ సింగర్స్‏లలో నేహా కక్కర్ (Neha Kakkar) ఒకరు. దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‏లో అనేక సింగింగ్ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అంతేకాకుండా ఎన్నో మధురమైన సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసినవారికి ఘాటు రిప్లై ఇచ్చింది నేహా. ఈ సింగర్‏కు విమర్శలు రావడం.. నెట్టింట ట్రోల్ చేయడం కొత్తమే కాదు. గతంలోనూ అనేకసార్లు నేహాను దారుణంగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేశారు. తాజాగా మరోసారి తన భావోద్వేగానికి గురయిన వీడియోను షేర్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలో తనపై కామెంట్స్ చేసేవారి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అందరు ఎమోషనల్‏గా ఉండరని.. తనను ఎగతాళి చేసే వ్యక్తులను తాను ఎప్పటికీ నిందించలేనని తెలిపింది. అసలు విషయమేంటంటే..

నేహా ఇటీవల సూపర్ స్టార్ 2లో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. ఇందులో మణి అనే కంటెస్టెంట్.. సూపర్ హిట్ సాంగ్ మాహి వే సాంగ్ అద్భుతంగా ఆలపించాడు. దీంతో నేహా కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఆమె ఇలా షోలో ఎమోషనల్ కావడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఇండియన్ ఐడల్ 12లో కృష్ణ అభిషేక్ స్టోరీ విని కన్నీళ్లు పెట్టుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న నేహా.. తాను రియాల్టీ షోలలో ఏడుస్తున్నందుకు తనను ఎప్పుడూ ట్రోల్ చేయడం గురించి అడగ్గా.. నేను వారిని నిందించలేను. చాలా మంది ఎమోషనల్ గా ఉండరు. భావోద్వేగాలు లేని వ్యక్తులకు నేను ఫేక్ గా కనిపిస్తాతను. కానీ నాలాంటి సున్నిత మనస్కులు మాత్రం నన్ను అర్థం చేసుకుంటారు. ఇతరుల బాధను అనుభవించడం.. వారికి సహాయం చేయాలనుకునే చాలా మందిని మనం చూడలేము. నాలో ఆ గుణం ఉంది. దాని గురించి నేను ఎప్పుడూ పశ్చాత్తాపడను. అంటూ చెప్పుకొచ్చింది. అలాగే రియాల్టీ షోలలో ఎన్నో ఆసక్తిని కలిగించే అంశాలు ఉంటాయని.. కేవలం పాటలు పాడడం, నృత్యం చేయడం మాత్రమే కాకుండా వారి వ్యక్తిగత జీవితాలు, కుటుంబాల గురించి కూడా తెలుసుకుంటాము. ఈ స్థాయిని చేరుకోవడానికి వారు ఎన్ని అడ్డంకులు ఎదుర్కోన్నారనేది తెలిసినప్పుడు భావోద్వేగానికి గురవుతాము అని తెలిపింది.