Alia Bhatt: అలియా భట్ మొదటి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఆసక్తికర విషయాలు చెప్పిన హీరోయిన్..

నా బ్యాంక్ ఖాతాలో ఎంత నగుదు ఉందనేది నేనెప్పుడు చూసుకోలేదు. కానీ అది కొద్దివరకు మెరుగ్గానే ఉందని తెలుసు. నా టీమ్ ఎప్పుడూ నాతో చెప్పేవారు ఆర్థిక స్థితిని ఎప్పుడూ చూసుకోవాలి అని.

Alia Bhatt: అలియా భట్ మొదటి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఆసక్తికర విషయాలు చెప్పిన హీరోయిన్..
Alia
Follow us

|

Updated on: Aug 21, 2022 | 10:46 AM

అతి చిన్న వయసులోనే సినీరంగ ప్రవేశం చేసి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా కొనసాగుతుంది అలియా భట్ (Alia Bhatt). డియర్ జిందగీ, గల్లీ బాయ్, హైవే, హంప్టీ శర్మకీ దుల్హనియా, 2 స్టేట్స్, కపూర్ అండ్ సన్స్, రాజీ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 2012లో కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అలియా భట్. ఇందులో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించారు. తాజాగా తన మొదటి సినిమా రెమ్యునరేషన్ గుర్తుచేసుకుంది అలియా. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆమె.. తన కెరీర్ ఆరంభరోజుల గురించి చెప్పుకొచ్చింది. మొదటి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కోసం ఆమె రూ. 15 లక్షలు తీసుకున్నట్లు తెలిపింది. తాను సంపాదించిన నగదును వాళ్ల అమ్మ సోనీ రజ్దాన్ చూసుకునేదని.. తన బ్యాంక్ ఖాతాలో ఉండే డబ్బు గురించి అలియాకు తెలియదని తెలిపింది.

నా బ్యాంక్ ఖాతాలో ఎంత నగుదు ఉందనేది నేనెప్పుడు చూసుకోలేదు. కానీ అది కొద్దివరకు మెరుగ్గానే ఉందని తెలుసు. నా టీమ్ ఎప్పుడూ నాతో చెప్పేవారు ఆర్థిక స్థితిని ఎప్పుడూ చూసుకోవాలి అని. ఇక కొద్దిరోజుల్లోనే మాకు బిడ్డ రాబోతున్నాడు. ఇప్పుడైనా నా ఆర్థిక స్థితిని గురించి తెలుసుకోవాలని భావిస్తున్నాను అని తెలిపింది అలియా. 19 సంవత్సరాల వయసులోనే సినీరంగ ప్రవేశం చేసిన అలియా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఫస్ట్ రెమ్యునరేషన్ తో ఓ కారును తీసుకున్నానని.. ఆ తర్వాత 22 సంవత్సరాల వయసులో మొదటి ఇంటిని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో అలియా తన ప్రియుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె.. బ్రహ్మస్త్ర, రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, జీలే జరా చిత్రాల్లో నటిస్తుంది. అంతేకాకుండా హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రంతో హాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!