Pushpa 2 The Rule: బన్నీ ఆర్మీకి గుడ్ న్యూస్.. పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా పుష్ప(Pushpa). పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాతో అల్లు అర్జున్ సంచలన విజయాన్ని అందుకున్నారు.

Pushpa 2 The Rule: బన్నీ ఆర్మీకి గుడ్ న్యూస్.. పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది
Pushpa 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 21, 2022 | 6:50 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా పుష్ప(Pushpa). పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాతో అల్లు అర్జున్ సంచలన విజయాన్ని అందుకున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించాడు. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు, ఆయన యాటిట్యూడ్ సినిమాకే హైలైట్. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకోవడమే కాదు కాసుల వర్షం కురిపించింది.

ఇప్పుడు పుష్ప2 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ లో ఎంతకావాలో అంతవరకే చూపించిన సుకుమార్.. పుష్ప 2లో అంతకు మించి యాక్షన్ తో పాటు ట్విస్ట్ లను చూపించనున్నారని తెలుస్తోంది. ఇక పుష్ప 2 కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్. పుష్ప2 పూజా కార్యక్రమాలు రేపు(22న ) నిర్వహించనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ట్వీట్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. దాంతో బన్నీ ఆర్మీ తెగ ఖుష్ అవుతున్నారు. ఇక పుష్ప సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటించిన విషయం తెలిసిందే. సెకండ్ పార్ట్ లోనూ ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తిగా ఉండేలా డిజైన్ చేశారట సుకుమార్. మరి ఈ సీక్వెల్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి