Trisha: త్రిషకు మరోసారి బ్రేకప్ ?.. విషపూరితమైన మనుషులంటున్న హీరోయిన్.. ఆసక్తికరంగా పోస్ట్..

ఇదిలా ఉంటే.. తాజాగా త్రిష తన ఇన్ స్టా ఖాతాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. విషపూరితమైన మనుషులంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.

Trisha: త్రిషకు మరోసారి బ్రేకప్ ?.. విషపూరితమైన మనుషులంటున్న హీరోయిన్.. ఆసక్తికరంగా పోస్ట్..
Trisha
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 21, 2022 | 12:27 PM

అందం, అభినయంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది త్రిష (Trisha). ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ చిన్నది.. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా కొనసాగింది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందరూ స్టార్ హీరోల సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సరసన 96 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష.. ప్రస్తుతం డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వన్ టీజర్, త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా త్రిష తన ఇన్ స్టా ఖాతాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. విషపూరితమైన మనుషులంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.

“విషపూరితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు వాళ్లంతట వాళ్లే నీతో మాట్లాడటం మానేయడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని చూస్తుంటే చెత్త దానంతటదే తొలగిపోయినట్లు ఉంది” అంటూ రాసుకొచ్చింది. దీంతో త్రిష చేసిన పోస్ట్ పై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. మరోసారి త్రిషకు బ్రేకప్ జరిగిందా ? ఇంతకీ ఆమె ఎవర్ని ఉద్దేశిస్తూ పోస్ట్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఆమెకు తమిళ్ ప్రొడ్యూసర్ వరుణ్ తో త్రిష ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబపెద్దల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ అనుహ్యంగా వీరు పెళ్లికి ముందే విడిపోయారు. ఆ తర్వాత తమిళ్ స్టార్ హీరోతో త్రిష ప్రేమలో ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా టాలీవుడ్ హీరోతోనూ త్రిష ప్రేమాయణం సాగినట్లుగా టాక్ నడిచింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసార త్రిష వ్యక్తిగత జీవితం, ప్రేమ గురించి నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..