The Ghost: నాగ్ నయా మూవీనుంచి క్రేజీ అప్డేట్… గోస్ట్ ట్రైలర్ వచ్చేది అప్పుడే

అక్కినేని నాగార్జున కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కేవలం సినిమాలతోనే కాదు మరో వైపు రియాలిటీ గేమ్ షోస్ తో కూడా ఆకట్టుకుంటున్నారు.

The Ghost: నాగ్ నయా మూవీనుంచి క్రేజీ అప్డేట్... గోస్ట్ ట్రైలర్ వచ్చేది అప్పుడే
The Ghost
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 21, 2022 | 8:29 PM

అక్కినేని నాగార్జున కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కేవలం సినిమాలతోనే కాదు మరో వైపు రియాలిటీ గేమ్ షోస్ తో కూడా ఆకట్టుకుంటున్నారు. ఇక నాగ్ సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్య బంగార్రాజు సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన ఈ మన్మధుడు. ఇప్పుడు గోస్ట్(The Ghost) గా రాబోతున్నారు.  నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. ఇప్పటి వరకు విడుదలైన రెండు ప్రోమోలు – ది కిల్లింగ్ మెషిన్, తమహగనే ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. మునుపెన్నడూ చూడని యాక్షన్ కంటెంట్, నాగార్జున సూపర్ స్టైలిష్ గా కనిపించడంతో  సినిమాపై ఆడియన్స్ లో క్యురియాసిటీని పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి ది ఘోస్ట్ ట్రైలర్‌పైనే పడింది.

ఎట్టకేలకు ట్రైలర్ డేట్ ప్రకటన వచ్చింది. ఆగస్ట్ 25న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్‌లో మరింత ఎక్సయిటింగ్ యాక్షన్‌ ని చూడబోతున్నాం. ఈ మేరకు ఓ పోస్టర్ నూయి రిలీజ్ చేశారు మేకర్స్. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగార్జున, సోనాల్ చౌహాన్ శిధిలమైన ఓ పెద్ద బిల్డింగ్లో దగ్గర నిలబడి వుండటం.. చిత్రంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను సూచిస్తుంది. నాగార్జున ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ పట్టుకొని డాషింగ్ అండ్ సూపర్ ఫిట్‌గా కనిపించగా, సోనాల్ చేతిలో కూడా గన్ వుండటం పోస్టర్ లో గమనించవచ్చు. నాగార్జున కిల్లర్ లుక్స్, యాక్షన్ సెటప్ అద్భుతంగా వుంది. ఈ పోస్టర్ అభిమానులు, ప్రేక్షకుల అంచనాలని, సినిమా ప్రమోషన్స్‌ను మరింత పెంచింది.  ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు కాగ, భరత్, సౌరబ్ ద్వయం పాటలు అందించారు.  భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి