Pawan Kalyan : “సినిమా దేశమంతా దుమ్ముదులిపేస్తోంది”.. కార్తికేయ 2ను పొగిడిన పవర్ స్టార్

ప్రస్తుతం ఎక్కడ చూసిన కుర్ర హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమాగా వచ్చినా పాన్ ఇండియా విజయాన్ని అందుకుంది ఈ మూవీ

Pawan Kalyan : సినిమా దేశమంతా దుమ్ముదులిపేస్తోంది.. కార్తికేయ 2ను పొగిడిన పవర్ స్టార్
Pawankalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 21, 2022 | 8:44 PM

ప్రస్తుతం ఎక్కడ చూసిన కుర్ర హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమాగా వచ్చినా పాన్ ఇండియా విజయాన్ని అందుకుంది ఈ మూవీ. చందుమొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన కార్తికేయ 2 సినిమా సూపర్ హిట్ ను సాధించింది. ఈ మూవీలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కృష్ణుడి కంకణం నేపథ్యంలో సాగిన ఈ సినిమా కథ ఆద్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కించాడు దర్శకుడు చందు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్రయూనిట్ ఫుల్ ఖుషి లో ఉన్నారు. ఇక సినిమా తారలు కూడా ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇప్పటికే ప్రభాస్ లాంటి బడా స్టార్స్ కార్తికేయ టీమ్ ను అబినంచగా.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కార్తికేయ 2 సినిమా గురించి మాట్లాడారు. కార్తికేయ అనే సినిమా వచ్చి దేశమంతా దుమ్ముదులిపేస్తుంది. నేను మార్పు రావాలని కోరుకుంటాను. ఇదే మార్పు అంటే అని అన్నారు పవన్. చిన్న సినిమాగా వచ్చిన దేశమంతా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.  ఇప్పుడు ఇదే ప్రస్తావన తీసుకువచ్చారు పవన్. పవన్ కార్తికేయను పొగడటంతో చిత్రయూనిట్ అంతా ఆనందంలో తేలిపోతున్నారు. నిఖిల్ ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి