Allu Arjun: 30 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తిని కలిసిన అల్లు అర్జున్.. చూడగానే చేతులేత్తి దండం పెట్టి.. పాదాలకు నమస్కరించిన హీరో..
తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఓ వ్యక్తిని దాదాపు 30 ఏళ్ల తర్వాత కలిసానని.. ఆమె ఎంతో మంచి వ్యక్తి అని.. తన వల్లే ఎన్నో విషయాలను నేర్చుకున్నాని చెప్పడం విశేషం.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఫాలోయింగ్ అందుకున్నారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీలో పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్‌లో బన్నీ నటన అదరగొట్టారు. ముఖ్యంగా పుష్పరాజ్ మేకోవర్.. డైలాగ్స్.. యాటిట్యూడ్ అభిమానులను పిచ్చేక్కించింది. ఈ సినిమా కోసం బన్నీ డెడికేషన్ పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. కొద్ది రోజులుగా సెకండ్ పార్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఓ వ్యక్తిని దాదాపు 30 ఏళ్ల తర్వాత కలిసానని.. ఆమె ఎంతో మంచి వ్యక్తి అని.. తన వల్లే ఎన్నో విషయాలను నేర్చుకున్నాని చెప్పడం విశేషం.
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్ సైట్ బిహైండ్ వుడ్స్ ఇటీవల అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు నయనతార, త్రిష, శింబు, మణిరత్నం, రజినీకాంత్ తోపాటు.. సినీరంగానికి చెందిన పలువురు నటీనటులు.. దర్శకనిర్మాతలు విచ్చేశారు. ఇందులో అల్లు అర్జున్ గోల్డెన్ ఐకాన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా అవార్డ్ అందుకున్నారు. రెహమాన్ చేతుల మీదుగా ఆయన అవార్డ్ అందుకున్నారు. అయితే అవార్డ్ అనంతరం అల్లు అర్జున్ ప్రసగించే సమయంలో స్టేజ్ పైకి ఆయన స్కూల్ టీజర్ వచ్చారు. ఆమెను చూడగానే బన్నీ ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆమె పాదలకు నమస్కరించారు.
ఆమె పేరు అంబికా కృష్ణన్ అని.. మూడో తరగతిలో తన క్లాస్ టీజర్ అని.. విద్యను అభ్యసించే సమయంలో తనకు ఎంతోమంది టీజర్స్ క్లాసులు చెప్పారని.. కానీ ఆమె మాత్రం ఎప్పటికీ గుర్తుంటారని అన్నారు. “టీచర్స్ అందరిలో అంబికా కృష్ణన్ టీచర్ ప్రథమస్థానంలో ఉంటారు. క్లాసులో 50 మంది విద్యార్థలు ఉంటే నాదే లాస్ట్ ర్యాంక్. అంతగా చదివేవాడిని కాదు. అయినా ఆమె ఎప్పుడూ నన్ను తిట్టలేదు. అర్జున్ మార్కులు సరిగ్గా రాలేదని బాధపడకు.
జీవితం అంటే కేవలం మార్కులు మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరికీ జీవితం వరం. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు తప్పకుండా నువ్వు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్తావు అని ఆమె చెప్పేవారు. ఈరోజు ఆమెను ఇక్కడ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. స్పూర్తి నింపేలా చిన్న చిన్న కోట్స్ రాయడం అలవాటు. అలా నేను రాసిన only kindness is remembered forever కోట్ కు నా టీచరే స్పూర్తి ” అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.