Actress Madhavi: అలనాటి అందాల తార మాధవి కూతుర్లను చూశారా ?.. అందంలో అమ్మను మించిపోయారు..
ఏపీలోని ఏలూరుకు చెందిన మాధవి.. 80-90'sలో శ్రీదేవి, విజయశాంతి, జయసుధ, జయప్రద వంటి స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. అప్పట్లో వీరిద్దరి జోడిగా అభిమానులు ఎక్కువే ఉండేవారు. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుతో మొదలైన వీరి ప్రయాణం ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య, చట్టంతో పోరాటం, మరణశాసనం, రోషగాడు, కోతల రాయుడు, దొంగమొగుడు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, బిగ్ బాస్ సినిమా వరకు కొనసాగింది.
వెండితెరపై అందం, అభినయంతో ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు చాలా మంది హీరోయిన్స్. ఒకప్పుడు అగ్రకథానాయికలుగా ఓ వెలుగు వెలిగి.. అంతలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. టాప్ స్టార్ హీరోల సరసన నటించిన పలువురు హీరోయిన్స్.. వివాహం చేసుకుని విదేశాల్లో సెటిల్ కాగా.. మరికొందరు సహాయ పాత్రలలో మెప్పిస్తున్నారు. అందులో సీనియర్ నటి మాధవిర ఒకరు. ఏపీలోని ఏలూరుకు చెందిన మాధవి.. 80-90’sలో శ్రీదేవి, విజయశాంతి, జయసుధ, జయప్రద వంటి స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. అప్పట్లో వీరిద్దరి జోడిగా అభిమానులు ఎక్కువే ఉండేవారు. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుతో మొదలైన వీరి ప్రయాణం ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య, చట్టంతో పోరాటం, మరణశాసనం, రోషగాడు, కోతల రాయుడు, దొంగమొగుడు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, బిగ్ బాస్ సినిమా వరకు కొనసాగింది. చిరుతోపాటు.. రజినీకాంత్, కమల్ హాసన్, శోభన్ బాబు, మమ్ముట్టి, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా భాషల్లో నటించింది.
అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే అమెరికాకు చెందిన వ్యాపారవేత్త మ్యాన్ రాల్ఫ్ శర్మను మాధవి వివాహం చేసుకున్నారు. వీరికి టిఫాని శర్మ, ప్రసిల్లా శర్మ, ఎవ్లీన్ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మాధవి ముగ్గురు కూతుర్లు అందంలో తమ తల్లిని మించిపోయారు. వీరు ఒకవేళ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే హీరోయిన్లుగా తమకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది.
ప్రస్తుతం మాధవి దంపతులు అమెరికాలోనే స్థిరపడ్డారు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మాధవి తన భర్తకు ఉన్న ఔషదాల సంస్థ బాధ్యతలను చూసుకుంటున్నారట. అలాగే ఫుడ్ బిజినెస్ లోనూ రాణిస్తున్నారట.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.