AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh : ఆ సమస్యతో బాధపడుతున్నా.. ఆ భయాలు నన్ను ఎప్పటికీ వెంటాడుతునే ఉంటాయి.. అడివి శేష్..

టాలీవుడ్ విలక్షణ నటుడు అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్షన్, హీరోయిజం కాకుండా విభిన్న కంటెంట్ ఉన్న చిత్రాలతో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మానసిక ఆరోగ్యం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Adivi Sesh : ఆ సమస్యతో బాధపడుతున్నా.. ఆ భయాలు నన్ను ఎప్పటికీ వెంటాడుతునే ఉంటాయి.. అడివి శేష్..
Adivi Sesh
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2026 | 5:35 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ నటుడిగా తనదైన ముద్ర వేశాడు అడివి శేష్. ఇప్పటివరకు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తెరపై ఎంతో ఆత్మవిశ్వాసంతో, ధైర్యవంతుడైన పాత్రల్లో కనిపించే ఈ హీరో, నిజ జీవితంలో తాను ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య గురించి తాజాగా రివీల్ చేశారు. తాను గత కొంతకాలంగా ‘తీవ్రమైన ఆందోళన’ (Severe Anxiety) సమస్యతో పోరాడుతున్నట్లు ఆయన బహిరంగంగా వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె.. కానీ తన అమ్మ వల్లే ఆమె జీవితం అలా.. నటుడు మురళీ మోహన్..

సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో ఉండే సెలబ్రిటీలు తమ వ్యక్తిగత సమస్యలను, ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను బయటపెట్టడానికి వెనకాడుతుంటారు. కానీ, అడివి శేష్ అత్యంత ధైర్యంగా తన పరిస్థితిని వివరించారు. ఈ యాంగ్జైటీ సమస్య తన రోజువారీ జీవితంపై, ముఖ్యంగా వృత్తిపరమైన బాధ్యతలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆయన పంచుకున్నారు. ఒత్తిడి పెరిగినప్పుడు కలిగే ఆందోళన వల్ల కొన్నిసార్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని, దీని నుంచి బయటపడటం ఒక నిరంతర ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : సీన్ సీన్‏కు గుండె ఆగిపోద్ది మావ.. క్లైమాక్స్ మాత్రం బీభత్సం.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న హారర్ సిరీస్..

” నాకు తీవ్రమైన యాంగ్జయిటీ సమస్య ఉంది. ఉదయాన్నే షూటింగ్ మొదలయ్యే ముందు చాలా భయంగా ఉంటుంది. ఆ సమయం నాకు చాలా గందరగోళంగా గడుస్తుంది. దీని నుంచి బయటపడటానికి అరోమాథెరపీ, కళ్లపై ఐస్ పెట్టుకోవడం వంటి చిన్న చిన్న పనులు చేస్తుంటాను. ఇవి నాకు అలవాట్లుగా మారిపోయాయి” అని అన్నారు అడివి శేష్. ఏదైనా భావోద్వేగమైన సన్నివేశంలో నటించాల్సి వస్తే ముందు రోజు రాత్రి నుంచి తన ఎమోషన్స్ ఆ మూడ్ కు తగ్గట్లుగా మార్చుకుంటానని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor : ఆరుగురు పతివ్రతలు తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు.. కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

మానసిక ఆరోగ్యం పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించడమే లక్ష్యంగా ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. “మనం శారీరక ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యతను మానసిక ఆరోగ్యానికి కూడా ఇవ్వాలి. ఏదైనా సమస్య ఉంటే దాని గురించి మాట్లాడటంలో తప్పు లేదు” అని అన్నారు.. ప్రస్తుతం ఆయన ఈ సమస్యను అధిగమించడానికి అవసరమైన చికిత్స, జీవనశైలి మార్పులను మారుస్తున్నట్లు తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Actress : ఆదర్శ కుటుంబంలోకి మరో హీరోయిన్.. ప్లాప్ హీరోయిన్‏కు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. ?

Follow Us