AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Broom Rules: ఇంట్లో చీపురు ఏ మూల పెడితే ఐశ్వర్యం.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఈ తప్పులు చేయొద్దు

ఇంట్లో చీపురును ఎలా ఉంచాలి, ఎక్కడ పెట్టాలి అనే విషయాలపై అనేక సందేహాలు ఉంటాయి. చీపురును ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి, దానిని సరైన పద్ధతిలో నిర్వహించడం ముఖ్యమని చెబుతారు. ఇంట్లో ఎప్పుడూ రెండు చీపుర్లను ఒకేచోట కలిపి ఉంచకూడదు. చీపురును ఉపయోగించిన తర్వాత దానిని ఊడ్చే భాగం కిందకు ఉంచి కాకుండా, తలకిందులుగా నిలువుగా లేదా పడుకోబెట్టి ఉంచాలి.

Broom Rules: ఇంట్లో చీపురు ఏ మూల పెడితే ఐశ్వర్యం.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఈ తప్పులు చేయొద్దు
సాయంత్రం వేళ కొన్ని ముఖ్యమైన వస్తువులను దానం చేయకూడదని పెద్దలు చెబుతున్నారు.వాటిలో ఇల్లు ఊడ్చుకునే చీపురు ఒకటి. వీటిని అస్సలు సాయంత్రం పూట అస్సలు ఎవరికి ఇవ్వకూడదు. ఇలా ఇస్తే లక్ష్మి దేవి కోప పడుతుందని చెబుతున్నారు.
Shaik Madar Saheb
|

Updated on: Mar 29, 2026 | 1:07 PM

Share

చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.. వాస్తుశాస్త్రం ప్రకారం.. చిపురు చెత్త (దరిద్రం)ను తొలగించి, శుభ్రత ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. అయితే.. ఇంట్లో చీపురును ఎక్కడ పెట్టాలి, ఎలా ఉపయోగించాలి అనే విషయాలపై అనేక ధర్మసందేహాలు నెలకొన్నాయి. వాస్తు, సంప్రదాయాల ప్రకారం చీపురు నిర్వహణకు కొన్ని నియమాలున్నాయి. ఈ నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో ఐశ్వర్యం, శుభాలు కలుగుతాయని నమ్ముతుంటారు. ముఖ్యంగా, ఇంట్లో రెండు చీపుర్లను ఒకేచోట కలిపి ఉంచకూడదు. ఇది అశుభమని కొన్ని నమ్మకాలు చెబుతున్నాయి. చీపురును ఊడిన తర్వాత, దాని ఊడ్చే భాగాన్ని కిందకు ఉంచి పెట్టకూడదు. అలా చేయడం వల్ల చీపురు పాడైపోతుంది.. అది సరియైన పద్ధతి కాదు. బదులుగా, చీపురును తలకిందులుగా, అనగా ఊడ్చే భాగం పైకి ఉండేలా నిలువుగా లేదా పడుకోబెట్టి ఉంచాలి.

చీపురును పెట్టే స్థలం కూడా చాలా ముఖ్యం. ఈశాన్య మూలలో చీపురును అస్సలు ఉంచకూడదు. ఈశాన్యం అనేది దైవిక శక్తికి సంబంధించిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. చీపురును నైరుతి లేదా పడమర దిశలో ఉంచడం శ్రేయస్కారం.. ఇది ఆర్థిక సమస్యలను తగ్గించి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. అలాగే, ఇంట్లోకి వచ్చే అతిథులకు లేదా కుటుంబ సభ్యులకు తరచుగా కనిపించే ప్రదేశంలో చీపురును పెట్టడం మంచిది కాదు. ఎవరికీ కనిపించని, ఒక ప్రశాంతమైన మూలలో ఉంచడం శ్రేయస్కరం. చీపురు, చెత్తాచెదారం చూడడానికి ఇష్టపడరు కాబట్టి, వాటిని ఎవరి కంటా పడకుండా ఉంచడం మంచిది.

ఇల్లు ఊడ్చే విధానంలో కూడా కొన్ని పద్ధతులు పాటించాలి. ఇల్లాలు సాధారణంగా ఈశాన్య మూలకు ఊడవకూడదు. ఈశాన్యం వైపు కాకుండా దక్షిణం వైపుకు ఊడవాలి. అలాగే, ప్రతి గదిలో చెత్తను ఆ గదిలోనే ఊడ్చి, అక్కడే తీసివేయాలి. ఒక గదిలోని చెత్తను గుమ్మాల మీదుగా మరొక గదిలోకి నెట్టడం లేదా ఊడవడం అస్సలు చేయకూడదు. గుమ్మాన్ని శ్రీమహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాల్సిన గుమ్మాల మీద చెత్తను ఊడ్చడం అపచారం. ఇది ఇంట్లో అశుభాలను తీసుకొస్తుందని నమ్మకం.

చీపురును ఎప్పుడూ కాళ్ళతో తొక్కకూడదు. చీపురు పవిత్రమైన వస్తువుగా పరిగణిస్తారు. ఒకానొక దేవత ఒక భక్తురాలికి వరంగా ఇచ్చిందని కూడా ఒక కథ ఉంది. కాబట్టి, పనికొచ్చే వస్తువులైనా, పనికిరాని వస్తువులైనా ఏదైనా సరే కాళ్ళతో తొక్కడం మంచి పద్ధతి కాదు. ఇది అగౌరవానికి సంకేతం.

చీపురు కొనుగోలుకు ప్రత్యేకమైన రోజులు ఏమీ లేవని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా సరుకులు కొనేటప్పుడు, నూనె లేదా ఉప్పు వంటి వాటికి కొన్ని నియమాలు ఉన్నప్పటికీ, చీపురు విషయంలో అలాంటి నియమాలు లేవు. అవసరమైనప్పుడు ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు. ఈ నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సంపద, శాంతి, శ్రేయస్సు కలుగుతాయని విశ్వసిస్తారు.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది.. గమనించగలరు..

Follow Us
నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా
కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!
కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!
14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్
14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్
శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే
శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే
వర్షాకాలంలో ఏసీ కరెంట్ బిల్లు తగ్గించే సీక్రెట్ ట్రిక్స్..
వర్షాకాలంలో ఏసీ కరెంట్ బిల్లు తగ్గించే సీక్రెట్ ట్రిక్స్..
ఆమె 90's కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. బాక్సాఫీస్ క్వీన్..
ఆమె 90's కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. బాక్సాఫీస్ క్వీన్..
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు
ఈ పుష్పం ఉంటే అదృష్టమే..! తొలి ఏకాదశి రోజు వికసించిన బ్రహ్మ కమలం
ఈ పుష్పం ఉంటే అదృష్టమే..! తొలి ఏకాదశి రోజు వికసించిన బ్రహ్మ కమలం
48 ఏళ్ల టెస్ట్ ట్యూబ్ బేబీ.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?
48 ఏళ్ల టెస్ట్ ట్యూబ్ బేబీ.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?