ఏందీ మేడమ్ మీరు.. సీరియల్ బ్యూటీని చూసి షాకవుతున్న ఫ్యాన్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
28 March 2026
తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం తిరుగులేని ఆదరణతో దూసుకుపోతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఈ సీరియల్‌లో 'స్వప్న' అనే కీలక పాత్రలో నటిస్తున్న రూప తన నటనతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. తన నటనతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
సీరియల్‌లో స్వప్న పాత్ర కాస్త నెగటివ్ షేడ్స్ కలిగి, స్వార్థంతో ఉన్నప్పటికీ, నిజ జీవితంలో మాత్రం రూప చాలా సరదా మనిషిగా తనకంటూ మంచి ఫాలోయింగ్ ఉంది.
ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఫాలోవర్లతో అందుబాటులో ఉంటారు.
తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని క్రేజీ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. షూటింగ్ విరామ సమయంలో తోటి నటీనటులతో కలిసి రూప చేసే హంగామా అంతా ఇంతా కాదు.
తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియోలలో ఆమె ఎనర్జీని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తెరపై ఎప్పుడూ గంభీరంగా లేదా ప్లాన్‌లు వేస్తూ కనిపించే స్వప్న
నిజ జీవితంలో ఇంత అల్లరి పిల్లనా? అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రూప కేవలం డాన్స్ వీడియోలే కాకుండా, తన లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసే ప్రతి పోస్ట్ నిమిషాల్లోనే వేలల్లో లైకులు, కామెంట్లను అందుకుంటోంది.