AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె.. కానీ తన అమ్మ వల్లే ఆమె జీవితం అలా.. నటుడు మురళీ మోహన్..

సినీ నటుడు మురళీ మోహన్ తన సుదీర్ఘ అనుభవాల నుండి ప్రముఖ నటీమణులైన శ్రీదేవి, దీప, జయసుధ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శ్రీదేవి సౌందర్యం, గ్లామర్ సాటిలేనిదని పేర్కొంటూ, ఆమె ఎక్స్‌ప్రెషన్, పర్సనాలిటీ గొప్పదని కొనియాడారు. అనంతరం దీప అందాన్ని ప్రశంసిస్తూనే, ఆమె సినీ జీవితంలో ఎదురైన ఒక కీలక అంశాన్ని వివరించారు. దీప చిన్న వయసులోనే పరిశ్రమలోకి రావడంతో, ఆమె తల్లి బ్యాగ్‌లో బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్ పెట్టి షూటింగ్ తర్వాత ఇచ్చేవారని తెలిపారు.

Tollywood: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె.. కానీ తన అమ్మ వల్లే ఆమె జీవితం అలా.. నటుడు మురళీ మోహన్..
Sridevi
Rajitha Chanti
|

Updated on: Mar 27, 2026 | 6:00 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న నటుడు మురళీ మోహన్. హీరోగా, సహయ నటుడిగా, నిర్మాతగా సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలువురు ప్రముఖ నటీమణులు, పరిశ్రమలోని విశేషాలపై తన అభిప్రాయాలను పంచుకు

Deepa

Deepa

న్నారు. శ్రీదేవి సౌందర్యాన్ని, గ్లామర్‌ను అద్భుతంగా అభివర్ణించిన ఆయన, ఆమె కళ్ళు, హావభావాలు, పర్సనాలిటీ గొప్పవని అన్నారు. శ్రీదేవి ఐదు అడుగుల ఏడు, ఎనిమిది అంగుళాల పొడవుతో తనకు ఈక్వల్‌గా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ఆమె ప్రవర్తన కూడా వండర్‌ఫుల్‌గా ఉండేదని, ఎప్పుడూ తప్పుగా మాట్లాడటం, చిలిపి పనులు చేయడం వంటివి చేసేవారు కాదని చెప్పారు. ఆ తర్వాత అంత అందగత్తె ఎవరంటే దీప అని మురళీ మోహన్ పేర్కొన్నారు. దీప అద్భుతంగా అందంగా ఉండేదని చెబుతూనే, ఆమె జీవితంలో ఒక కీలక మలుపు గురించి వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Actor : అందంగా లేని హీరోని పెట్టి తీయడం వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. నటుడు రవిబాబు..

దీప చాలా చిన్న వయసులోనే సినీ రంగంలోకి వచ్చిందని, అప్పట్లో ఆమె వయసు “పదహారు సంవత్సరాల మూడు నెలలు” అని చెప్పేవారని తెలిపారు. ఆమె తల్లి షూటింగ్ తర్వాత బిస్కెట్లు, జీడిపప్పులు, బాదం పప్పులు బ్యాగ్‌లో పెట్టి ఇచ్చేవారని, అది ఆమె శరీర బరువు పెరగడానికి ఒక కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. లేదా, కొందరు ముందే ఆర్టిస్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టెరాయిడ్స్ ఇచ్చి ఉండవచ్చు అని అంటారు, ఎంతవరకు నిజమో తెలియదని పేర్కొన్నారు. దీని మూలంగానే దీప శరీరంలో మార్పులు వచ్చి, బ్లోట్ అయ్యిందని, లేకపోతే ఆమె ఒక అద్భుతమైన నటి అయ్యేదని మురళీ మోహన్ అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Anushka Shetty : ఆ హీరో నాకు చాలా స్పెషల్.. అతడే నాకు గాడ్ ఫాదర్.. నా జీవితాన్ని మార్చేశాడు.. అనుష్క కామెంట్స్..

జయసుధను “ఫ్యామిలీ లేడీ” అని, ఆమెతో నటించేటప్పుడు సహజత్వమే కనిపిస్తుందని చెప్పారు. జయసుధ మేకప్ లేకుండా, మామూలు చీరలు కట్టుకొని, మధ్యతరగతి కుటుంబ పాత్రలకు తగినట్లుగా కనిపించేదని, ఆమె నటనలో ఎలాంటి కృత్రిమత్వం ఉండదని కొనియాడారు. ఆయన కెరీర్‌లో అత్యధిక సినిమాలు జయసుధతోనే చేశానని, ఆమె ఎంతో కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Aadi Movie: ఆది సినిమాలో ఎన్టీఆర్ జోడిగా ఆ హీరోయిన్ చేయాల్సింది.. తనని వెళ్లి అడిగితే ఏం జరిగిందంటే.. డైరెక్టర్ వివి వినాయక్..

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: సైకో భర్తతో కన్నీళ్ల కాపురం.. భార్యతో బలవంతపు శృంగారం.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..

Follow Us